టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో నిలిచాడు. గత 13 ఏళ్లగా భారత్‌ను ఊరిస్తున్న వరల్డ్‌కప్‌ను అందించేందుకు హిట్‌మ్యాన్ సిద్దమయ్యాడు. టీ20 వరల్డ్‌కప్-2024 ఫైనల్ పోరులో బార్బోడస్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. అయితే ఈ టోర్నీలో రోహిత్ శర్మ కెప్టెన్‌గానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనలతో కూడా అదరగొడుతున్నాడు.
ఈ మెగా ఈవెంట్‌లో రోహిత్ సారథ్యంలోని భారత్ జట్టు ఇప్పటివరకు ఆజేయంగా నిలిచింది. ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ రోహిత్ సేన విజయం సాధించింది. సూపర్-8లో ఆసీస్‌పై అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడిన రోహిత్.. ఇంగ్లండ్‌తో సెమీస్‌లోనూ సత్తాచాటాడు.
ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో ఫైనల్లోనూ రోహిత్ అదరగొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మపై సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ప్రశంసల వర్షం కురిపించాడు. హిట్‌మ్యాన్‌కు తన పెద్ద అభిమానినని మహారాజ్ చెప్పుకొచ్చాడు.
"నేను రోహిత్ శర్మకు వీరాభిమానిని. బ్యాటింగ్‌లో అతడు డేరింగ్ అండ్ డాషింగ్. బౌలర్లకు అతడంటే చాలా భయం. కెప్టెన్‌గా కూడా రోహిత్ అద్బుతం. అతడికి అత్యుత్తమ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. గేమ్‌ను బాగా ఆర్ధం చేసుకుంటాడు.
జట్టులో పూర్తి స్వేఛ్చను రోహిత్ ఇస్తాడు. ఆటగాళ్లను సపోర్ట్ చేసి వారిలో బెస్ట్‌ను తీయడంలో రోహిత్ దిట్ట. ఫీల్డ్‌లో కూడా రోహిత్ చాలా వ్యూహాత్మకంగా ఉంటడాని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహారాజ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment