Ind vS SA Test: South Africa Batting And Bowling Strength: టీమిండియా- దక్షిణాఫ్రికా జట్ల మధ్య సమరానికి సమయం ఆసన్నమైంది. డిసెంబరు 26 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో గెలవాలని కోహ్లి సేన ఉవ్విళ్లూరుతుండగా... సొంతగడ్డపై తమకు తిరుగులేదంటూ ప్రొటిస్ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో పటిష్ట బ్యాటింగ్ గల భారత్‌ను దెబ్బకొట్టేందుకు దక్షిణాఫ్రికా వ్యూహాలు రచిస్తోంది. నిజానికి... ఐపీఎల్-2022 సీజన్‌లో, టి20 ప్రపంచకప్‌లో చక్కగా రాణించిన సీమర్ అన్రిచ్ నోర్జేను... సొంతగడ్డపై తురుపుముక్కగా జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ తుంటి గాయంతో మొత్తం సిరీస్‌కే దూరమవడం జట్టుకు శాపమైంది.
ఈ నేపథ్యంలో బౌలింగ్ భారమంతా రబడపైనే పడింది. ఇన్‌గిడి, ఒలీవర్‌లు ఉన్నప్పటికీ నోర్జే అంతటి ప్రస్తుత పేస్ పదును వీరికి లేదు. స్పిన్నర్ కేశవ్ మహరాజ్ సొంతగడ్డపై తన మాయాజాలం కనబరిచేందుకు తహతహలాడుతున్నాడు. బ్యాటింగ్‌లో కెప్టెన్ ఎల్గర్, మార్క్‌రమ్, పీటర్సన్, డసెన్‌లతో పాటు వికెట్ కీపర్ డికాక్ అందరూ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఎల్గర్, మార్క్‌రమ్ శుభారంభమిస్తే... మిడిలార్డర్‌లో డసెన్, బవుమా ఇన్నింగ్స్‌ను భారీస్కోరువైపు నడిపించగలరు.
జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, రహానే/శ్రేయస్ అయ్యర్/ హనుమ విహారి, రిషభ్ పంత్, అశ్విన్, శార్దుల్, షమీ, బుమ్రా, సిరాజ్/ఇషాంత్ శర్మ.
దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్ (కెప్టెన్), మార్క్‌రమ్, కీగన్ పీటర్సన్, వాన్ డెర్ డసెన్, బవుమా, డికాక్, వియాన్ మల్డర్, కేశవ్ మహారాజ్, రబడ,డిన్‌గిడి, ఒలీవర్.
చదవండి: India vs South africa: దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ సాధించిన రికార్డులు ఇవే..
Comments
Please login to add a commentAdd a comment