టీమిండియాతో తొలి టెస్టు.. రబాడ అరుదైన ఘనత! కేవలం 28 ఏళ్లకే | Kagiso Rabada becomes seventh SA bowler with 500 international wickets | Sakshi
Sakshi News home page

IND vs SA: టీమిండియాతో తొలి టెస్టు.. రబాడ అరుదైన ఘనత! కేవలం 28 ఏళ్లకే

Published Wed, Dec 27 2023 1:07 PM | Last Updated on Wed, Dec 27 2023 1:27 PM

Kagiso Rabada becomes seventh SA bowler with 500 international wickets - Sakshi

సెంచూరియన్‌ వేదికగా టీమిండియాతో జరుగుతున్న బ్యాక్సింగ్‌ డే టెస్టులో దక్షిణాఫ్రికా స్పీడ్‌ స్టార్‌ నిప్పులు చేరుగుతున్నాడు. తొలి రోజు ఏకంగా 5 వికెట్లు పడగొట్టి భారత్‌ను బ్యాక్‌ఫుట్‌లో ఉంచాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, శార్ధూల్‌ ఠాకూర్‌ వంటి కీలక వికెట్లను రబాడ పడగొట్టాడు. ఈ క్రమంలో రబాడ ఓ అరుదైన ఘనత సాధించాడు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన ఎలైట్ బౌల‌ర్ల‌ జాబితాలో చోటు ద‌క్కించుకున్నాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో రబాడ 39వ స్ధానంలో నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో శార్ధూల్‌ ఠాకూర్‌ను ఔట్‌ చేసిన ఈ సఫారీ సూపర్‌ స్టార్‌.. ఈ అరుదైన తన పేరిట లిఖించుకున్నాడు.

కేవలం 28 ఏళ్లకే రబాడ ఈ ఘనత సాధించడం విశేషం. అదేవిధంగా అంతర్జాతీయ  క్రికెట్‌లో ద‌క్షిణాఫ్రికా త‌రుపున అత్య‌ధిక వికెట్లు తీసిన ఏడో బౌల‌ర్‌గా రబాడ రికార్డులకెక్కాడు.
దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన‌ బౌల‌ర్లు..
షాన్ పొలాక్ – 829 వికెట్లు
డేల్ స్టెయిన్ – 699
మ‌ఖాయ ఎంతిని – 662
అలాన్ డోనాల్డ్ – 602
జాక్వెస్ కలిస్ – 577
మోర్నీ మోర్కెల్ – 544
కగిసో రబడ – 500*

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement