సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశ పరిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేసి రోహిత్ తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. దక్షిణాఫ్రికా పేసర్ రబాడ ట్రాప్ చేసి మరి హిట్‌మ్యాన్‌ను పెవిలియన్ పంపాడు. ఫైన్ లెగ్‌లో ఫీల్డర్‌ను పెట్టి రోహిత్‌కు షార్ట్ బాల్‌ను రబాడ సంధించాడు.
ఈ క్రమంలో భారీ షాట్‌కు ప్రయత్నించిన రోహిత్.. ఫైన్ లెగ్ ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో చేసేదేమి లేక రోహిత్ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ఓటమి అనంతరం రోహిత్‌కు ఇదే తొలి మ్యాచ్. కాగా టెస్టుల్లో రోహిత్‌ను రబాడ ఔట్ చేయడం ఇది 13వ సారి కావడం గమనార్హం.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రోహిత్(5), జైశ్వాల్(17), గిల్(2) తీవ్ర నిరాశపరిచారు. ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్‌ను విరాట్ కోహ్లి(15), శ్రేయస్ అయ్యర్(9) చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 16 ఓవర్లకు భారత్ స్కోర్: 50/3.
చదవండి: Adudam Andhra: ఏపీ క్రీడా సంబురం: టాలెంట్ హంట్‌లో CSK! ప్రణాళికాబద్ధంగా జగన్ ప్రభుత్వం
Rohit Sharma Gone 💔
— Ali Khan (@ProPakistanii7) December 26, 2023
Early break through for SA#RohitSharma #AUSvsPAK #INDvsSA #ShubmanGill pic.twitter.com/R9gGwcz1qh
Comments
Please login to add a commentAdd a comment