చ‌రిత్ర సృష్టించిన సంజూ శాంస​న్‌.. తొలి భారత క్రికెటర్‌గా | IND Vs SA 1st T20I: Sanju Samsons Stunning Feat, Becomes First Indian To Score Consecutive T20i Centuries | Sakshi
Sakshi News home page

IND vs SA: చ‌రిత్ర సృష్టించిన సంజూ శాంస​న్‌.. తొలి భారత క్రికెటర్‌గా

Published Sat, Nov 9 2024 7:52 AM | Last Updated on Sat, Nov 9 2024 10:37 AM

IND vs SA 1st T20: Sanju Samsons stunning feat

డర్బన్‌​ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ విధ్వంసకర సెంచ‌రీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన శాంసన్ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. స్టేడియం నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ అభిమానులను అలరించాడు.

ఈ క్ర‌మంలో కేవ‌లం 47 బంతుల్లోనే త‌న రెండో అంతర్జాతీయ టీ20 సెంచ‌రీని సంజూ అందుకున్నాడు. ఓవరాల్‌గా 50 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న సంజూ 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 107 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సెంచ‌రీతో మెరిసిన శాంస‌న్ పలు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

శాంసన్‌ సాధించిన రికార్డులు ఇవే..
👉అంత‌ర్జాతీయ టీ20ల్లో వ‌రుస ఇన్నింగ్స్‌ల‌లో సెంచ‌రీలు బాదిన తొలి భార‌త బ్యాట‌ర్‌గా శాంస‌న్ చ‌రిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్ కంటే ముందు హైదరాబాద్‌​ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో శాంసన్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు.

ఇప్పుడు అదే ఇన్నింగ్స్‌ను సఫారీ గడ్డపై రిపీట్‌ చేశాడు. తద్వారా ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా ప్రపంచక్రికెట్‌లో ఈ ఘనత సాధించిన నాలుగో ప్లేయర్‌గా సంజూ రికార్డులకెక్కాడు. గతంలో గుస్తావ్ మెక్‌కియాన్ (ఫ్రాన్స్‌), ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్‌), రిలీ రూసో (దక్షిణాఫ్రికా) ఈ ఘనత సాధించారు.

👉అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన భారత ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డును శాంసన్ సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో సంజూ 10 సిక్స్‌లు నమోదు చేశాడు. గతంలో శ్రీలంకతో జరిగిన టీ20లో హిట్‌మ్యాన్ కూడా 10 సిక్స్‌లు బాదాడు.

👉టీ20ల్లో దక్షిణాఫ్రికా గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన భారత ఆటగాడిగా సంజూ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత టీ20 కెప్టెన్‌​ సూర్యకుమార్ యాదవ్‌ పేరిట ఉండేది. గతేడాది డిసెంబర్‌లో జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో సూర్యకుమార్ 100 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో సూర్య రికార్డును ఈ కేరళ బ్యాటర్ బ్రేక్ చేశాడు.

👉ప్రొఫెషనల్ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా 7000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆరో భార‌త బ్యాట‌ర్‌గా శాంస‌న్ నిలిచాడు. కేవ‌లం 269 ఇన్నింగ్స్‌లలో ఈ ఫీట్‌ను శాంస‌న్ సాధించాడు. ఈ క్ర‌మంలో మహేంద్ర సింగ్ ధోనీని(365) అధిగమించాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాలో కేఎల్ రాహుల్(197) అగ్ర‌స్ధానంలో ఉండ‌గా.. విరాట్ కోహ్లి(212), శిఖర్ ధావన్(246), సూర్యకుమార్ యాదవ్(249), సురేశ్ రైనా(251) తర్వాతి స్ధానాల్లో ఉన్నారు.

భారత్‌ ఘన విజయం..
ఇక ఈ మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో దక్షిణాఫ్రిను భారత్‌ చిత్తు చేసింది. దీంతో నాలుగు టీ20ల సిరీస్‌లో1-0 ఆధిక్యంలోకి టీమిండియా దూసుకెళ్లింది. 202 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో దక్షిణాఫ్రికా చతికలపడింది. భారత బౌలర్ల దాటికి సౌతాఫ్రికా కేవలం 141 పరుగులకే ఆలౌటైంది.
చదవండి: గుడ్‌ న్యూస్‌ చెప్పిన కేఎల్‌ రాహుల్‌


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement