IND Vs SA 1st T20: Rohit Sharma Huge Cut Out In Kerala, Pic Viral - Sakshi
Sakshi News home page

Rohit Sharma: కేరళలో రోహిత్‌ క్రేజ్‌ మామూలుగా లేదు! ఫొటో వైరల్‌

Published Wed, Sep 28 2022 12:36 PM | Last Updated on Wed, Sep 28 2022 1:29 PM

Ind Vs Sa 1st T20 Kerala: Rohit Sharma Huge Cut Out Pic Goes Viral - Sakshi

India vs South Africa, 1st T20I- Rohit Sharma: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై కేరళవాసులు అభిమానం చాటుకున్నారు. హిట్‌మ్యాన్‌ తమ రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో భారీ కటౌట్‌ ఏర్పాటు చేశారు. భారత కెప్టెన్‌కు ఘన స్వాగతం పలికారు. కాగా దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ఆరంభంలో భాగంగా ఇరు జట్లు తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం వేదికగా తలపడబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్‌, ప్రొటిస్‌ జట్లు అక్కడికి చేరుకున్నాయి.

ఈ నేపథ్యంలో ఆల్‌ కేరళ రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ భారీ కటౌట్‌ ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. దైవభూమి హిట్‌మ్యాన్‌కు స్వాగతం పలుకుతోంది అని పేర్కొంది. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇదిలా ఉంటే.. స్థానిక బ్యాటర్‌ సంజూ శాంసన్‌కు టీ20 వరల్డ్‌కప్‌-2022 జట్టులో చోటు దక్కని నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై అతడి ఫ్యాన్స్‌ ఫైర్‌ అయిన విషయం తెలిసిందే. ప్రతిభ ఉన్నా సంజూకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ ప్రశ్నిస్తూ.. బుధవారం నాటి మ్యాచ్‌ సందర్భంగా నిరసన తెలియజేసేందుకు సిద్ధమయ్యారంటూ వార్తలు వెలువడ్డాయి.

అదే సమయంలో రోహిత్‌పై అభిమానం కురిపిస్తూ ఏర్పాటు చేసిన కటౌట్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇక విరాట్‌ కోహ్లి కటౌట్లు కూడా కేరళలో దర్శనమిస్తున్నాయి. కాగా దక్షిణాఫ్రికాతో సిరీస్‌లోనూ సంజూకు జట్టులో స్థానం దక్కలేదు. అయితే, న్యూజిలాండ్‌-ఏ జట్టుతో స్వదేశంలో జరిగిన అనధికారిక వన్డే సిరీస్‌కు సారథిగా వ్యవహరించాడు ఈ కేరళ బ్యాటర్‌.

చెన్నై వేదికగా మంగళవారం జరిగిన మూడో వన్డేలో అర్ధ శతకంతో మెరిసి.. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. సంజూ సారథ్యంలో భారత- ఏ జట్టు కివీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం విశేషం.
చదవండి: Ind Vs SA 1st T20: అతడు లేని జట్టు బలహీనం.. టీమిండియా ఓడిపోతుంది: భారత మాజీ క్రికెటర్‌
Ind Vs SA T20, ODI Series: దక్షిణాఫ్రికాతో టీమిండియా టీ20, వన్డే సిరీస్‌లు.. పూర్తి షెడ్యూల్‌! ఇతర వివరాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement