కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత జట్టు వ్యహాలు రచిస్తోంది. తొలి టెస్టులో ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. శనివారం టీమిండియా నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోంది.
ఈ ప్రాక్టీస్ సెషన్‌కు భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ డుమ్మా కొట్టారు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడను ఎదుర్కొనేందుకు హిట్‌మ్యాన్ ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాడు. భారత పేసర్ ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.
దాదాపు రెండు గంటల పాటు ముఖేష్ బౌలింగ్‌ను రోహిత్ ఎదుర్కొన్నాడు. ముఖేష్ బౌలింగ్‌లో ఎక్కువగా లెంగ్త్ బాల్స్‌ను రోహిత్ ప్రాక్టీస్ చేశాడు. కాగా గత కాలంగా రబాడ బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి శర్మ ఇబ్బంది పడుతున్నాడు. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో కూడా రబాడ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.
ఇప్పటివరకు 14 సార్లు హిట్‌మ్యాన్‌ను రబాడ ఔట్ చేశాడు. ఇక జనవరి 3 నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇక ఈ మ్యాచ్‌కు రవీంద్ర జడేజా తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. జడ్డూ పూర్తి ఫిట్‌నెస్ సాధించి నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.
చదవండి: ఐపీఎల్ ఒలింపిక్స్‌తో సమానం.. చాలా సంతోషంగా ఉంది: లక్నో హెడ్ కోచ్
Comments
Please login to add a commentAdd a comment