ICC ODI WC 2023: సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది టీమిండియా. చెన్నైలోని చెపాక్ మైదానంలో ఆస్ట్రేలియాతో తమ ఆరంభ మ్యాచ్ ఆడుతోంది. ఈ క్రమంలో అభిమానులు, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ఆల్ ది బెస్ట్ చెబుతూ భారత జట్టును విష్ చేస్తున్నారు.
ఈ క్రమంలో ఓ వ్యక్తి నెటిజన్ల దృష్టిని ఆకర్షించాడు. తన కుమారుడు ప్రపంచకప్-2023లో ఈవెంట్లో ఆడుతున్న తరుణంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మద్దతుగా నిలుస్తూ.. హిట్‌మ్యాన్‌పై అభిమానం చాటుకున్నాడు.
ఆ వ్యక్తి ఎవరంటే.. సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబడ తండ్రి ఎంఫో రబడ. ‘‘ఈరోజు టీమిండియాకు నా మద్దతు’’ అంటూ రోహిత్ శర్మ పేరిట జెర్సీని ధరించి భారత జట్టును విష్ చేశాడు. రబడ తండ్రి చేసిన ప్రయత్నం రోహిత్ ఫ్యాన్స్‌తో పాటు టీమిండియా అభిమానులను ఆకట్టుకుంటోంది.
కాగా తన తనయుడు కగిసో రబడకు చీర్ చేసేందుకు ఎంఫో రబడ భారత్‌కు వచ్చాడు. ఢిల్లీలో సౌతాఫ్రికా- శ్రీలంక మధ్య శనివారం నాటి మ్యాచ్‌కు హాజరై.. తన కుమారుడికి మద్దతు తెలిపాడు. కాగా లంకపై ప్రొటిస్ జట్టు ఏకంగా 102 పరుగుల తేడాతో గెలుపొంది ఘనంగా ఐసీసీ ఈవెంట్‌ను ఆరంభించింది.
ఈ మ్యాచ్‌లో రబడ 7.5 ఓవర్ల బౌలింగ్‌లో 50 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక నవంబరు 5న టీమిండియా- సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగనుంది. మరి అప్పుడు ఎంఫో రబడ ఏం చేస్తాడో చూడాలి అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
చదవండి: #Ducks: ఆనందం కాసేపు కూడా లేదు! నువ్వేం కెప్టెన్? గోల్డెన్ డక్ బాయ్ నువ్వేమో..
Comments
Please login to add a commentAdd a comment