సెంచూరియన్ వేదికగా భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు ఆటముగిసింది. వర్షం కారణంగా తొలి రోజు కేవలం 59 ఓవర్లు ఆట మాత్రమే సాధ్యమైంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్(70 బ్యాటింగ్), సిరాజ్ ఉన్నారు.
అయితే మొదటి రోజు దక్షిణాఫ్రికా బౌలర్లు భారత్‌పై పైచేయి సాధించారు. ముఖ్యంగా స్టార్ పేసర్ రబాడ ఐదు వికెట్లతో చెలరేగాడు. రబాడతో పాటు బర్గర్ రెండు, జానెసన్ ఒక వికెట్ సాధించారు. భారత బ్యాటర్లలో రాహుల్‌తో పాటు విరాట్ కోహ్లి(38), శ్రేయస్ అయ్యర్(31) పరుగులతో పర్వాలేదన్పించారు. కాగా ఈ మ్యాచ్‌లో జైశ్వాల్(17),రోహిత్ శర్మ(5), గిల్(2) తీవ్ర నిరాశపరిచారు.
రాహుల్ క్లాసీ ఇన్నింగ్స్..
భారత ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. క్రమం తప్పకుండా వికెట్లు పడతున్నప్పటికీ.. రాహుల్ ఆచితూచి ఆడుతూ టీమిండియా స్కోర్ 200 పరుగుల దాటడంలో కీలక పాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు నిప్పులు చేరుగుతున్న చోట రాహుల్ క్లాసీ ఇన్నింగ్స్ ఆడాడు.
చదవండి: #KL Rahul: రబాడ బౌన్సర్ల వర్షం.. అయినా గానీ! శెభాష్ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment