
దక్షిణాఫ్రికా వన్డే జట్టులో కేశవ్
చాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక
జోహన్నెస్‌బర్గ్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే దక్షిణాఫ్రికా వన్డే జట్టులో భారత సంతతికి చెందిన కేశవ్ మహరాజ్‌కు చోటు దక్కింది. 15 మంది సభ్యులు గల ఈ జట్టును క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) బుధవారం ప్రకటించింది. 26 ఏళ్ల లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ ఈ సీజన్‌లో దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో రాణించడంతో వన్డేల్లోనూ స్థానం కల్పించారు.
గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోని స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ చాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. 10 నెలల తర్వాత మోర్నీ మోర్కెల్ మళ్లీ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. సఫారీ జట్టుకు డివిలియర్స్ నాయకత్వం వహిస్తాడు. ఈ టోర్నీలో జూన్ 3న జరిగే తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా శ్రీలంకతో తలపడనుంది. ఐసీసీ ఈవెంట్‌కు ముందు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు మూడు వన్డేల సిరీస్‌లో పోటీపడతాయి. మే 24న తొలి వన్డే హెడింగ్లీలో జరుగనుంది.
దక్షిణాఫ్రికా జట్టు: డివిలియర్స్ (కెప్టెన్), ఆమ్లా, డికాక్, డుప్లెసిస్, డుమినీ, మిల్లర్, బెహర్డీన్, మోరిస్, పార్నెల్, ఫెహ్లూక్వయో, రబడా, తాహిర్, ప్రిటోరియస్, కేశవ్, మోర్కెల్.