గయానా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 40 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-1 తేడాతో సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 160 పరుగులకే కుప్పకూలింది.
విండీస్ బౌలర్లలో యువ పేసర్ షమీర్ జోషఫ్ 5 వికెట్లతో చెలరేగగా.. సీల్స్ మూడు,హోల్డర్, మోటీ తలా వికెట్ సాధించారు. ప్రోటీస్ బ్యాటర్లలో డేన్ పీడ్ట్(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం వెస్టిండీస్ కూడా తొలి ఇన్నింగ్స్‌లో తేలిపోయింది.
దక్షిణాఫ్రికా బౌలర్ల దాటికి 144 పరుగులకే చాప చుట్టేసింది. 16 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన ప్రోటీస్ 246 పరుగులకు ఆలౌటైంది. సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో వెర్రెయిన్నే(59), మార్‌క్రమ్(51) హాఫ్ సెంచరీలతో రాణించారు.
వెస్టిండీస్ బౌలర్లలో జైడన్ సీల్స్ 6 వికెట్లతో సత్తాచాటాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని కలుపునకుని విండీస్ ముందు 263 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఉంచింది. లక్ష్య చేధనలో కరేబియన్ జట్టు 222 పరుగులకు ఆలౌటైంది. కేశవ్ మహారాజ్, రబాడ తలా మూడు వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాడు. ఇక ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment