SA vs WI 1st Test: చెల‌రేగిన కెప్టెన్‌.. ప‌టిష్ట స్థితిలో సౌతాఫ్రికా | SA vs WI 1st Test: Temba Bavuma, de Zorzi knocks solidify South Africa | Sakshi
Sakshi News home page

SA vs WI 1st Test: చెల‌రేగిన కెప్టెన్‌.. ప‌టిష్ట స్థితిలో సౌతాఫ్రికా

Published Fri, Aug 9 2024 1:50 PM | Last Updated on Fri, Aug 9 2024 4:17 PM

SA vs WI 1st Test: Temba Bavuma, de Zorzi knocks solidify South Africa

ట్రినిడాడ్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో ద‌క్షిణాఫ్రికా అద్బుతమైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తుంది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల న‌ష్టానికి 344 ప‌రుగులు చేసింది.

క్రీజులో ముల్డ‌ర్‌(37), ర‌బాడ‌(12) ప‌రుగుల‌తో ఉన్నారు. ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ టెంబా బావుమా(86) ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. అత‌డితో పాటు టోనీ డి జోర్జి(78), బవెర్రెయిన్నే(39) ప‌రుగుల‌తో రాణించారు. అయితే ఆ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌ ఐడైన్‌ మార్‌క్రమ్‌ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసి మార్‌క్రమ్ ఔటయ్యాడు. 

ఇక విండీస్ బౌల‌ర్ల‌లో జోమెల్ వారికన్ 3 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. కీమ‌ర్ రోచ్‌, సీల్స్ త‌లా రెండు వికెట్లు సాధించారు. కాగా వ‌ర్షం కార‌ణంగా తొలి రోజు కేవ‌లం 15 ఓవ‌ర్ల ఆట మాత్రమే సాధ్య‌ప‌డింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement