8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం
సమయం: 19:00.. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేధించింది. కెప్టెన్ బవుమా తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ .. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్(39) రాణించి ఇన్నింగ్స్‌కు పునాది వేశాడు. ఆ తర్వాత ఎయిడెన్ మార్క్రమ్(51 నాటౌట్), వాన్ డర్ డస్సెన్(43 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. విండీస్ బౌలర్లలో హొస్సేన్ ఒక వికెట్ పడగొట్టాడు. పొదుపుగా బౌలింగ్ చేసిన నోర్జే(1/14)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంతకముందు విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. సఫారి బౌలర్లలో ప్రిటోరియస్ 3 వికెట్లతో చెలరేగగా.. కేశవ్ మహారాజ్ 2, నోర్జే, రబాడ తలో వికెట్ పడగొట్టారు.
రెండో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. హెండ్రిక్స్(39) ఔట్
సమయం 6:12.. ఇన్నింగ్స్ 9.2వ ఓవర్లో దక్షిణాఫ్రికా రెండో వికెట్ కోల్పోయింది. అకీల్ హొసేన్ బౌలింగ్‌లో హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి హెండ్రిక్స్(30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్) ఔటయ్యాడు. 10 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 66/2. క్రీజ్‌లో వాన్ డర్ డస్సెన్(19), మార్క్రమ్(1) ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. బవుమా (2) రనౌట్
సమయం 5:30.. 144 పరుగుల నామమాత్రపు స్కోర్‌ను ఛేదించే క్రమంలో సఫారి జట్టు ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. జట్టు కెప్టెన్ బవుమా(3 బంతుల్లో 2) రనౌటయ్యాడు. రసెల్ అద్భుతమైన త్రోతో బవుమాను పెవిలియన్‌కు పంపాడు. తొలి ఓవర్ తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 4/1. క్రీజ్‌లో హెండ్రిక్స్(2), వాన్ డర్ డస్సెన్ ఉన్నారు.
విండీస్ నామమాత్రపు స్కోర్.. దక్షిణాఫ్రికా లక్ష్యం 144
సమయం 5:13.. ప్రిటోరియస్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో విండీస్ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. పోలార్డ్(20 బంతుల్లో 26; 2 ఫోర్లు, సిక్స్), హేడెన్ వాల్ష్(0) వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేరారు. దీంతో విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. సఫారి బౌలర్లలో ప్రిటోరియస్ 3 వికెట్లతో చెలరేగగా.. కేశవ్ మహారాజ్ 2, నోర్జే, రబాడ తలో వికెట్ పడగొట్టారు.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన విండీస్
సమయం 4:57.. నోర్జే వేసిన 19వ ఓవర్‌లో విండీస్ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది. 18.2వ ఓవర్‌లో తొలుత రసెల్(4 బంతుల్లో 5; ఫోర్) క్లీన్ బౌల్డ్ కాగా.. నాలుగో బంతికి హెట్‌మైర్(2 బంతుల్లో 1) రనౌట్‌గా వెనుదిరిగాడు. 19 ఓవర్ల తర్వాత విండీస్ స్కోర్ 136/6. క్రీజ్‌లో పోలార్డ్(26), బ్రావో(1) ఉన్నారు.
గేల్(12) ఔట్.. 18 ఓవర్ల తర్వాత విండీస్ స్కోర్ 131/4
సమయం 4:52.. ప్రిటోరియస్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్ తొలి బంతికి గేల్(12 బంతుల్లో 12; సిక్స్) ఔటయ్యాడు. వికెట్‌కీపర్ క్లాసీన్‌కు క్యాచ్ ఇచ్చి గేల్ పెవిలియన్ బాట పట్టాడు. 18 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 131/4. క్రీజ్‌లో పోలార్డ్(23), రసెల్(5) ఉన్నారు.
విండీస్ మూడో వికెట్ డౌన్.. సిమన్స్(16) ఔట్
సమయం 4:29.. రబాడ వేసిన ఇన్నింగ్స్ 13.2వ ఓవర్లో లెండిల్ సిమన్స్(35 బంతుల్లో 16) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 14 ఓవర్ల తర్వాత దక్షిణాఫ్రికా స్కోర్ 93/3. క్రీజ్‌లో గేల్(2), పోలార్డ్(3) ఉన్నారు.
పూరన్(12) ఔట్.. విండీస్ 87/2
సమయం 4:23.. సఫారి స్పిన్నర్ కేశవ్ మహారాజ్.. వరుస ఓవర్లలో విండీస్‌ను దెబ్బకొట్టాడు. 11వ ఓవర్‌లో హార్డ్ హిట్టర్ ఎవిన్ లూయిస్‌ను పెవిలియన్‌కు పంపిన అతను.. 13వ ఓవర్ రెండో బంతికి పూరన్(7 బంతుల్లో 12; 2 ఫోర్లు)ను ఔట్ చేశాడు. పూరన్.. మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 13 ఓవర్ల తర్వాత విండీస్ స్కోర్ 89/2. క్రీజ్లో సిమన్స్(33 బంతుల్లో 16), క్రిస్ గేల్(1) ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన విండీస్.. ఎవిన్ లూయిస్(56) ఔట్
సమయం 4:16.. ధాటిగా ఆడుతున్న ఎవిన్ లూయిస్(35 బంతుల్లో 56; 3 ఫోర్లు, 6 సిక్సర్లు)ను కేశవ్ మహారాజ్ బోల్తా కొట్టించాడు. ఇన్నింగ్స్ 10.3వ ఓవర్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన లూయిస్.. రబాడకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 11 ఓవర్ల తర్వాత విండీస్ స్కోర్ 74/1. క్రీజ్లో లెండిల్ సిమన్స్(30 బంతుల్లో 13), నికోలస్ పూరన్(1) ఉన్నారు.
ఎవిన్ లూయిస్ సిక్సర్ల మోత.. 10 ఓవర్ల తర్వాత విండీస్ 65/0
సమయం 4:11.. విండీస్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. కేవలం 33 బంతుల్లో 3 ఫోర్లు 5 భారీ సిక్సర్ల సాయంతో అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. మరో ఎండ్‌లో లెండిల్ సిమన్స్(28 బంతుల్లో 13) నిదానంగా ఆడుతున్నప్పటికీ లూయిస్ మాత్రం చెలరేగుతున్నాడు. 10 ఓవర్ల తర్వాత విండీస్ స్కోర్ 65/0.
ఆచితూచి ఆడుతున్న విండీస్.. 5 ఓవర్ల తర్వాత 36/0
సమయం 3:50.. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు ఆచితూచి ఆడుతుంది. తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. ఓపెనర్లలో ఎవిన్ లూయిస్(19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగుతుండగా.. లెండిల్ సిమన్స్(11 బంతుల్లో 4) నిదానంగా ఆడుతున్నాడు.
దుబాయ్: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 గ్రూప్-1లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు షెడ్యూలైన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో ఇరు జట్లు ఇప్పటికే చెరో ఓటమి చవిచూసి బోణి విజయం కోసం ఎదురు చూస్తున్నాయి. విండీస్.. ఇంగ్లండ్ చేతిలో ఓడగా, సఫారీలు.. ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలయ్యారు.
పొట్టి ఫార్మాట్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 15 సార్లు ముఖాముఖి పోరులో తలపడగా.. దక్షిణాఫ్రికా 9, విండీస్ 5 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా 2-1 ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు జరిగిన 6 టీ20 ప్రపంచకప్‌లలో(2007, 2009, 2010, 2012, 2014, 2016) కరీబియన్ జట్టు మంచి ట్రాక్ రికార్డే కలిగి ఉంది. 2 సార్లు ఛాంపియన్(2012, 2016)గా నిలిచి డిఫెండింగ్ ఛాంపియన్‌గా కొనసాగుతుంది. మరోవైపు ఈ మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేకపోయింది. 2009, 2014లో సెమీస్ చేరడమే ఆ జట్టుకు అత్యుత్తమం.
తుది జట్లు:
దక్షిణాఫ్రికా: టెంబా బవుమా (కెప్టెన్), హెన్రిక్ క్లాసీన్(వికెట్‌కీపర్), వాన్ డెర్ డస్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, రీజా హెండ్రిక్స్, డేవిడ్ మిల్లర్, డ్వేన్ ప్రిటోరియస్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడా, అన్రిచ్ నోర్జే, తబ్రేజ్ షమ్సీ
వెస్టిండీస్: లెండిల్ సిమన్స్, ఎవిన్ లూయిస్, క్రిస్ గేల్, షిమ్రోన్ హెట్‌మైర్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్ (కీపర్), కీరన్ పొలార్డ్ (కెప్టెన్), ఆండ్రీ రస్సెల్, అకేల్ హోసేన్, హేడెన్ వాల్ష్, రవి రాంపాల్
Comments
Please login to add a commentAdd a comment