
టీ20 వరల్డ్‌కప్-2024 సన్నాహాకాల్లో వెస్టిండీస్ తమ సొంత గడ్డపై దక్షిణాఫ్రికాతో ఆరు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతోంది. ఈ క్రమంలో జమైకా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో 28 పరుగుల తేడాతో విండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
వెస్టిండీస్ బ్యాటర్లలో కెప్టెన్ బ్రాండెన్ కింగ్(79) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మైర్స్(34), ఛేజ్(32) పరుగులతో రాణించారు. సఫారీ బౌలర్లలో ఫెహ్లుక్వాయో, బార్ట్‌మన్ తలా 3 వికెట్లు పడగొట్టగా.. కొయిట్జీ ఒక్క వికెట్ సాధించారు. అనంతరం 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. 19.5 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది.
ఓపెనర్ రీజా హెండ్రిక్స్(87) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటకి.. మిగితా బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో ప్రోటీస్ జట్టు ఓటమి పాలైంది. కరేబియన్ బౌలర్లలో ఫోర్డే, మోటీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. మెకాయ్ రెండు, ఛేజ్, జోషఫ్ చెరో వికెట్ సాధించారు.