Temba Bavuma On Quinton De Kock Refusal To Take Knee: టీ20 వరల్డ్‌కప్-2021 టోర్నీలో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు జట్టు నుంచి తప్పుకొన్న క్వింటన్ డికాక్ నిర్ణయంపై దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా స్పందించాడు. ‘‘మ్యాచ్‌కు కొన్ని గంటలముందు సీఎస్‌ఏ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదు. డికాక్ నిర్ణయం మాకూ ఆశ్చర్యం కలిగించింది. అతను చిన్నపిల్లాడు కాదు. తన నిర్ణయం తాను తీసుకోగలడు. దానికే కట్టుబడే ఉంటాడు. అతని నిర్ణయాన్ని మేం గౌరవిస్తాం.
అతనిపై ఎలాంటి చర్య తీసుకుంటారనేది ఒక కెప్టెన్‌గా నేను ఇప్పుడే చెప్పలేను. దానిని నేను నిర్ణయించలేను. ప్రపంచకప్‌లో రాబోయే మ్యాచ్‌లపై కూడా మేం దృష్టి పెట్టాల్సి ఉంది. అయితే ఒకటి మాత్రం నిజం. డికాక్ మాలో ఒకడు. అతనికి మా వైపు నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అండగా ఉంటాం. ఏదైనా అతను మాతో చర్చించవచ్చు. నాకు తెలిసి మేం సహచరులం దీనిపై మాట్లాడుకోగలం’’ అని బవుమా స్పష్టం చేశాడు.
అసలేం జరిగిందంటే...
జాతి వివక్షకు వ్యతిరేకంగా సాగుతున్న ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ (బీఎల్‌ఎమ్) కోసం ప్రపంచవ్యాప్తంగా వివిధ క్రీడా వేదికల్లో సంఘీభావం తెలుపుతున్న విషయం తెలిసిందే. ఆటగాళ్లు మోకాలిపై కూర్చొని ఈ ఉద్యమానికి మద్దతు పలుకుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు ముందుకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు (సీఎస్‌ఏ) సైతం తమ ఆటగాళ్లకు ఇదే తరహా ఆదేశాలు ఇచ్చింది. అయితే, తాను ఈ ఆదేశాలను పాటించలేనంటూ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్.. మ్యాచ్ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాడు.
శ్వేత జాతీయుడైన డికాక్ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అవసరమైతే మ్యాచ్ ఆడను కానీ అలా మాత్రం చేయనంటూ అతను తన మాటపైనే నిలబడ్డాడు. టాస్ సమయంలో కెప్టెన్ బవుమా ‘వ్యక్తిగత కారణాలతో డికాక్ దూరమయ్యాడు’ అని ప్రకటించడంతో ఈ విషయం గురించి అందరికీ తెలిసింది. డికాక్ తన శ్వేత జాతి అహంకారాన్ని ప్రదర్శించాడని ఒకవైపు నుంచి విమర్శలు వస్తుండగా... అతడి ఇష్టానికి వదిలేయడమే సరైందని మరికొందరు డికాక్‌కు మద్దతుగా నిలిచారు.
ఇక క్రికెట్ ప్రపంచంలో ఊహించని ఈ పరిణామం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆటతో సంబంధం లేని అంశంలో తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ప్రకటిస్తూ ప్రపంచకప్‌లాంటి మెగా ఈవెంట్‌లో ఒక ఆటగాడు మ్యాచ్‌కు దూరమయ్యేందుకు సిద్ధం కావడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
చదవండి: T20 World Cup 2021 Pak Vs NZ: రెండు మేటి జట్లపై విజయాలు.. సెమీస్ దారిలో పాక్ ..
Comments
Please login to add a commentAdd a comment