వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే గజ్జ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు. సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో గజ్జ నొప్పితో అతడు బాధపడ్డాడు. ఈ క్రమంలో అతడిని పరిశీలించిన ప్రొటీస్ వైద్య బృందం కనీసం వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. దీంతో అతడిని రెండో టెస్టుకు ముందు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు నుంచి రిలీజ్ చేసింది.
ఇక విండీస్‌తో జరిగిన తొలి టెస్టులో 87 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ప్రోటీస్ విజయంలో నోర్జే కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో చెలరేగిన అన్రిచ్ .. రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఒక వికెట్ సాధించాడు. ఇక గాయపడిన నోర్జే స్థానంలో ఆల్‌రౌండర్ విలియమ్ ముల్డర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు వాండరర్స్ వేదికగా మార్చి8 నుంచి ప్రారంభం కానుంది.
దక్షిణాఫ్రికా తుది జట్టు(అంచనా): డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్రామ్, టోనీ డి జోర్జి, టెంబా బావుమా (కెప్టెన్), కీగన్ పీటర్సన్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), సెనురన్ ముత్తుసామి, మార్కో జాన్సెన్, విలియ్ ముల్డర్, కగిసో రబడా, గెరాల్డ్ కోయెట్జీ
చదవండి: Virat Kohli: సెంచరీ కరువైంది.. ఆ విషయం తెలుసు.. కానీ: ఆసీస్ దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment