సౌతాఫ్రికా క్రికెట్ జట్టు బ్యాటింగ్ లీడ్‌గా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఎంపికయ్యాడు. అశ్వెల్ ప్రిన్స్ స్థానంలో తాత్కాలిక ప్రాతిపదికన ఈ బాధ్యతలు చేపట్టనున్నాడు. వెస్టిండీస్‌తో సిరీస్ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
కాగా సౌతాఫ్రికా తరఫున 2009లో ఒకే ఒక్క టెస్టు మ్యాచ్ ఆడాడు ఇమ్రాన్ ఖాన్. ఆ తర్వాత ఈ లెఫ్టాండ్ బ్యాటర్‌కు మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కలేదు. కాగా పదిహేనేళ్లపాటు దేశవాళీ జట్టు డాల్ఫిన్స్ జట్టు టాపార్డర్‌లో బ్యాటర్‌గా కొనసాగిన ఇమ్రాన్ ఖాన్.. రెడ్ బాల్ క్రికెట్‌లో అద్భుతంగా రాణించాడు. 161 మ్యాచ్‌లు ఆడి 20 శతకాల సాయంతో 9367 పరుగులు సాధించాడు.
ఇక తన కెరీర్‌లో 121 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 51 టీ20లలోనూ భాగమయ్యాడు. జాతీయ జట్టులో పెద్దగా అవకాశాలు రాకపోయినా.. కోచ్‌గా మాత్రం విజయవంతమయ్యాడు.
దేశవాళీ క్రికెట్‌లో డాల్ఫిన్స్ జట్టు శిక్షకుడిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్.. ఆ జట్టుకు రెండుసార్లు ట్రోఫీ అందించాడు. అంతేకాదు..అతడి మార్గదర్శనంలో డాల్ఫిన్స్ టీమ్ వన్డే కప్‌లో ఒకసారి, సీఎస్‌ఏ టీ20 టోర్నమెంట్లలో మూడుసార్లు ఫైనల్ చేరింది.
తొలిసారి సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా..
వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న సౌతాఫ్రికా జట్టు ఆగష్టు 7 నుంచి టెస్టు సిరీస్ ఆడనుంది. ఆగష్టు 7- 11, ఆగష్టు 15- 19 వరకు రెండు మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ క్రమంలో తొలిసారిగా ఇమ్రాన్ ఖాన్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. తన నియామకంపై హర్షం వ్యక్తం చేసిన ఇమ్రాన్ ఖాన్.. కోచ్‌గా తన అంతిమ లక్ష్యానికి చేరువయ్యానని ఉద్వేగానికి లోనయ్యాడు.
చదవండి: WI vs SA: సౌతాఫ్రికాతో సిరీస్.. ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు చోటు
Comments
Please login to add a commentAdd a comment