
సౌతాంప్టన్: వన్డే వరల్డ్‌కప్‌లో వర్షం కారణంగా మరో మ్యాచ్ రద్దయ్యింది. మూడు రోజుల క్రితం శ్రీలంక-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, తాజాగా దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ జట్ల జరగాల్సిన మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు. దక్షిణాఫ్రికా 7.3 ఓవర్లలో 29/2 వద్ద ఉండగా వర్షం పడటంతో మ్యాచ్ నిలిచిపోయింది. ఆ తర్వాత మ్యాచ్ జరపడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఓ దశలో వర్షం వెలిసి కవర్లు తొలిగించే క్రమంలో మరొకసారి వరుణుడు అంతరాయం కల్గించాడు. కనీసం 20 ఓవర్ల మ్యాచ్ జరపాలకున్నప్పటికీ అది సాధ్యం కాలేదు. చివరకు భారత కాలమానప్రకారం రాత్రి గం.8.50 ని.లకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు తలో పాయింట్ లభించింది.
Comments
Please login to add a commentAdd a comment