
Tabriaz Shamsi Most Wickets In Calender Year.. టి20 క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రెయిజ్ షంసీ అరుదైన ఘనత సాధించాడు. టి20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఎక్కువ వికెట్లు సాధించిన ఆటగాడిగా షంసీ రికార్డు సాధించాడు. టి20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో షంసీ 17 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి ఈ రికార్డును అందుకున్నాడు.2021 ఏడాదిలో టి20ల్లో షంసీ 32 వికెట్లు పడగొట్టి మూడేళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఓవరాల్‌గా షంసీ సౌతాఫ్రికా తరపున 45 టి20ల్లో 53 వికెట్లు.. 2 టెస్టుల్లో 6 వికెట్లు.. 30 వన్డేల్లో 44 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: SA Vs SL: నోర్జ్టే సూపర్ డెలివరీ.. పెరీరాకు ఫ్యూజ్‌లు ఎగిరిపోయుంటాయి
2018 క్యాలండర్ ఇయర్‌లో ఆండ్రూ టై 31 వికెట్లు సాధించాడు. ఇక ఐసీసీ టి20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో షంసీ ప్రస్తుతం నెంబర్‌వన్ బౌలర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాదిలోనే మరో ఇద్దరు క్రికెటర్లు కూడా టి20ల్లో ఒకే ఏడాదిలో అత్యధిక వికెట్లు సాధించిన జాబితాలో చోటు సంపాధించారు. వారే ఉగాండాకు చెందిన దినేష్ నకర్ణి(31 వికెట్లు), వసీమ్ అబ్బాస్(29 వికెట్లు) ఉన్నారు.
చదవండి: SA Vs SL: డికాక్ మోకాళ్లపై నిల్చున్నాడు.. ఇప్పుడైనా వదిలేయండి