పార్ల్ రాయల్స్ జట్టులోకి ఐర్లాండ్‌ విధ్వంసకర ఆటగాడు | Paul Stirling joins Paarl Royals as replacement for Obed McCoy | Sakshi
Sakshi News home page

SA20 2023: పార్ల్ రాయల్స్ జట్టులోకి ఐర్లాండ్‌ విధ్వంసకర ఆటగాడు

Published Tue, Feb 7 2023 2:12 PM | Last Updated on Tue, Feb 7 2023 2:12 PM

Paul Stirling joins Paarl Royals as replacement for Obed McCoy - Sakshi

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2023కు వెస్టిండీస్‌ స్టార్‌ పేసర్‌ ఒబెడ్ మెకాయ్ గాయం కారణంగా దూరమై సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన వేలంలో మెకాయ్‌ను పార్ల్ రాయల్స్ కొనుగోలు చేసింది. అయితే ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా అతడు ఆడలేదు. ఈ క్రమంలో మెకాయ్ స్థానాన్ని ఐర్లాండ్ స్టార్‌ బ్యాటర్‌ పాల్ స్టిర్లింగ్‌తో పార్ల్ రాయల్స్ భర్తీ చేసింది.

ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా రాయల్స్ మెనేజెమెంట్‌ వెల్లడించింది. ఇక ఫిబ్రవరి 7న ప్రిటోరియా క్యాపిటల్స్‌లతో పార్ల్ రాయల్స్ తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌ జట్టు సెలక్షన్‌కు స్టిర్లింగ్‌ అందుబాటులో ఉండనున్నాడు.

ఇక స్టిర్లింగ్‌  ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో కూడా భాగమయ్యాడు. ఈ టోర్నీలో  అబుదాబి నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు 6 మ్యాచ్‌ల్లో 168 పరుగులు చేశాడు. అయితే ప్లే ఆఫ్స్‌కు నైట్‌రైడర్స్‌ అర్హత సాధించడంలో విఫలమైంది. ఇక ఓవరాల్‌గా తన కెరీర్‌లో 120 టీ20లు ఆడిన అతడు 3181 పరుగులు చేశాడు.
చదవండి: IND vs AUS: భారత్‌ గెలవాలంటే.. రాహుల్‌ ఓపెనర్‌గా వద్దు! అతడే సరైనోడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement