
Fans Happy With David Warner Form.. టి20 ప్రపంచకప్ 2021లో భాగంగా సూపర్ 12 గ్రూఫ్ 1లో శ్రీలంక, ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ 65 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. వార్నర్ ఇన్నింగ్స్‌తో అతని ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. వారి సంబరాలకు కారణం ఏంటంటే వార్నర్ ఫామ్‌లోకి రావడమేనంట. అందుకు తగ్గట్టుగానే వార్నర్ ఫిఫ్టీ సాధించిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌వైపు చూస్తూ నేను ఫామ్‌లోకి వచ్చా.. గుర్తుపెట్టుకోండి అన్నట్లుగా చేతితో విజయం గుర్తును చూపించాడు. ప్రస్తుతం వార్నర్ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
చదవండి: AUS Vs SL: టి20 చరిత్రలో రెండో వేగవంతమైన బంతికి ఔటైన లంక క్రికెటర్‌గా
నిజానికి టి20 ప్రపంచకప్ ఆరంభమైన తర్వాత వార్నర్ ఫామ్ ఆ జట్టును ఆందోళన పరిచింది. అయితే (అక్టోబర్ 27) వార్నర్ తన బర్త్‌డే సందర్భంగా ఒక స్టేట్‌మెంట్ ఇచ్చాడు. నేను ఫామ్‌లోకి వచ్చేందుకు ఒక్క మ్యాచ్ చాలు అన్ని కామెంట్ చేశాడు. కాగా వార్నర్ ఆ స్టేట్‌మెంట్ ఇచ్చిన మరునాడే శ్రీలంకపై కీలక ఇన్నింగ్స్ ఆడి తన ఫామ్‌ను చూపించాడు.
కాగా టి20 ప్రపంచకప్‌కు ముందు జరిగిన ఐపీఎల్‌లో వార్నర్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఎస్‌ఆర్‌హెచ్ తరపున ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన వార్నర్ 195 పరుగులు మాత్రమే చేశాడు. అయితే అనూహ్యంగా వార్నర్‌ను కెప్టెన్సీ పదవి నుంచి తొలగిస్తూ ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణయం తీసుకోవడంతో సెకండ్‌ఫేజ్ పోటీల్లో వార్నర్ జట్టుకు దాదాపు దూరంగా ఉండడం.. తుది జట్టులో చోటు దక్కకపోవడం.. డ్రింక్స్ మోయడం.. జెండాలు ఊపడం అతని ఫ్యాన్స్‌కు బాధ కలిగించింది. కానీ తాజాగా వార్నర్ మళ్లీ ఫామ్‌లోకి రావడంతో అతని అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
చదవండి: David Warner: టి20 ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా తరపున తొలి బ్యాటర్‌గా