రెండు సిక్సర్లు.. 30 పరుగులు; వార్నర్‌ ముంగిట అరుదైన రికార్డు | T20 World Cup 2021: 2 Milestones Waiting For David Warner Vs NZ Final | Sakshi
Sakshi News home page

David Warner: రెండు సిక్సర్లు.. 30 పరుగులు; వార్నర్‌ ముంగిట అరుదైన రికార్డు

Published Sun, Nov 14 2021 5:37 PM | Last Updated on Sun, Nov 14 2021 6:00 PM

T20 World Cup 2021: 2 Milestones Waiting For David Warner Vs NZ Final - Sakshi

David Warner Waiting For 2 Milestones Vs NZ Final T20 WC 2021.. టి20 ప్రపంచకప్‌ 2021లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఒక టి20 ప్రపంచకప్‌ ఎడిషన్‌లో ఆస్ట్రేలియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచేందుకు వార్నర్‌ కేవలం 30 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో 236 పరుగులు సాధించాడు. కివీస్‌తో జరగనున్న ఫైనల్లో 30 పరుగులు చేస్తే వార్నర్‌ అరుదైన ఘనత అందుకుంటాడు.

ఇంతకముందు 2007 టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్‌ చేసిన 265 పరుగులే ఆ జట్టు తరపున అత్యధిక స్కోరుగా ఉంది. ఆ తర్వాత షేన్‌ వాట్సన్‌ 2012 టి20 ప్రపంచకప్‌లో 249 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఈ టి20 ప్రపంచకప్‌లో దుబాయ్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ల్లో వార్నర్‌ ఇప్పటివరకు 14 సిక్స్‌ర్లు కొట్టాడు. మరో రెండు సిక్స్‌లు కొడితే షాహిద్‌ అఫ్రిదిని(15 సిక్సర్లు) దాటి తొలి స్థానంలో నిలవనున్నాడు.

చదవండి: T20 WC 2021: 'దుబాయ్' చేజింగ్‌ కింగ్‌; టాస్‌ గెలిస్తే బౌలింగ్‌ ఎంచుకోవడం ఖాయం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement