
David Warner Not Out But Walks Off After Umpires Call.. టి20 ప్రపంచకప్ 2021లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ 49 పరుగులు చేసి ఒక్క పరుగుతో హాఫ్ సెంచరీ మార్క్‌ను మిస్ చేసుకున్నాడు. అయితే తాను ఔటైన విధానం చూస్తే మాత్రం దురదృష్టాన్ని తనంతట తానే కొనితెచ్చుకున్నట్లు అనిపించింది. విషయంలోకి వెళితే.. ఫించ్ ఔటైన తర్వాత 49 పరుగులతో నిలకడగా ఆడుతున్న వార్నర్.. షాబాద్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ తొలి బంతిని ఫ్లిక్ చేశాడు. బంతి వెళ్లి కీపర్ రిజ్వాన్ చేతిలో పడింది.
బ్యాట్‌కు తాకినట్లు శబ్దం రావడంతో పాకిస్తాన్ అప్పీల్‌కు వెళ్లగా.. అంపైర్ ఔటిచ్చాడు. వార్నర్ కూడా తాను ఔటమోనని భావించి పెవిలియన్ చేరాడు. అయితే అల్ట్రాఎడ్జ్‌లో మాత్రం బ్యాట్‌కు బంతి ఎక్కడా తగలినట్లు కనిపించలేదు. దీనికి తోడూ స్పైక్ కూడా ఫ్లాట్‌గా వచ్చింది. వార్నర్ కాస్త ఆలోచించి రివ్యూకు వెళ్లి ఉంటే ఫలితం వేరేలాగా ఉండేది. అలా వార్నర్‌ను దురదృష్టం వెంటాడింది. దీంతో అభిమానులు వార్నర్ ఔటైన తీరుపై వినూత్న రీతిలో స్పందించారు. వార్నర్ అన్న.. ఏంటన్నా ఇది.. కొంచెం ఆలోచించి రివ్య్వూకు వెళ్లి ఉంటే బాగుండేది.. అంటూ కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment