
లండన్: వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో పోరుకు సిద్ధమైంది. శనివారం కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా శ్రీలంకతో ఆసీస్ తలపడతోంది. ఆసీస్ ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో సెమీస్ దిశగా దూసుకెళుతోంది. లంకపై గెలిచి నాకౌట్‌కు మరింత దగ్గర కావాలని కంగారూలు ఉవ్విళ్లూరుతున్నారు. భారత్ చేతిలో ఓడినా.. పాకిస్తాన్‌పై భారీ విజయంతో ఫించ్ సేన మళ్లీ ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. పాక్‌పై సెంచరీ కొట్టిన వార్నర్, ఫిఫ్టీ చేసిన కెప్టెన్ ఫించ్‌లపై ఆ జట్టు మళ్లీ అంచనాలు పెట్టుకొంది. స్మిత్, ఖవాజ ఫామ్‌లోకి రావాల్సి ఉంది.
మరోవైపు లంక ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి.. ఒకటి ఓడింది. వర్షం కారణంగా రెండు మ్యాచ్‌లు రద్దవడంతో లంక 4 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. దీంతో లంకేయులు నాకౌట్ చేరాలంటే ఈ మ్యాచ్‌తో పాటు తర్వాతి నాలుగు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే.. ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య 96 మ్యాచ్‌లు జరిగాయి. 60 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గెలుపొందగా... శ్రీలంకకు ఖాతాలో 32 విజయాలు చేరాయి. నాలుగు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు తొమ్మిదిసార్లు తలపడ్డాయి. ఏడు సార్లు ఆస్ట్రేలియాను విజయం వరించగా... ఒకసారి మాత్రమే శ్రీలంక (1996 ఫైనల్లో) గెలిచింది. మరో మ్యాచ్ రద్దయింది.
తుది జట్లు
ఆసీస్
అరోన్ ఫించ్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్‌సన్, బెహ్రాన్‌డార్ఫ్
శ్రీలంక
దిముత్ కరుణరత్నే(కెప్టెన్), కుశాల్ పెరీరా, లహిరు తిరిమన్నే, కుశాల్ మెండిస్, ఏంజేలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, తిషారీ పెరీరా, మిలిందా సిరివర్థనే, ఇసురు ఉదాన, లసిత్ మలిలంగా, నువాన్ ప్రదీప్