సిడ్నీ: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు వికెట్ కీపర్ అలీసా హీలీ తన కెరీర్‌లో కొత్త మైలురాయి అందుకుంది. మహిళల అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో 100 మ్యాచ్‌లు ఆడిన రెండో ఆస్ట్రేలియా క్రికెటర్‌గా, ఓవరాల్‌గా తొమ్మిదో క్రికెటర్‌గా ఆమె ఘనత వహించింది. శ్రీలంక జట్టుతో సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా 29 ఏళ్ల అలీసా ఈ ఘనత సాధించింది. ఇంతకుముందు ఆసీస్ తరఫున ఎలీస్ పెర్రీ మాత్రమే 100 టి20 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది.
తన కుటుంబసభ్యుల హాజరీలో 100వ మ్యాచ్ ఆడిన అలీసా 15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సహాయంతో 21 పరుగులు చేసి ఔటైంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్లతో శ్రీలంకను ఓడించింది. తొలుత శ్రీలంక 20 ఓవర్లలో 8 వికెట్లకు 84 పరుగులు చేయగా... ఆస్ట్రేలియా 9.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 87 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2–0తో సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment