SL Vs AUS ODI Series: Travis Head Ruled Out Of 5th ODI Due To Hamstring Injury - Sakshi
Sakshi News home page

SL Vs AUS 5th ODI: కీలక సిరీస్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్‌! స్టార్‌ ప్లేయర్‌ అవుట్‌!

Published Thu, Jun 23 2022 2:59 PM | Last Updated on Thu, Jun 23 2022 3:32 PM

SL vs AUS ODI Series: Travis Head Ruled Out Of 5th ODI Why - Sakshi

ట్రవిస్‌ హెడ్‌(PC: ICC)

Sri Lanka Vs Australia: శ్రీలంక పర్యటనలో భాగంగా ఇప్పటికే వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు సమర్పించుకున్న ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ట్రవిస్‌ హెడ్‌ జట్టుకు దూరమయ్యాడు. తొడ కండరాల గాయం కారణంగా నామమాత్రపు ఐదో వన్డేకు అతడు అందుబాటులో ఉండటం లేదు.

ఒకవేళ గాయం తీవ్రతరమైతే జూన్‌ 29 నుంచి ఆరంభమయ్యే టెస్టు సిరీస్‌కు కూడా ట్రవిస్‌ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఆసీస్‌ జట్టులో కీలక సభ్యుడైన ట్రవిస్‌ హెడ్‌ శ్రీలంక పర్యటనలో భాగంగా మూడో వన్డేలో 70 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 

కాగా 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇప్పటికే శ్రీలంక 3-1తో కైవసం చేసుకుంది. తద్వారా సొంతగడ్డపై దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా దసున్‌ శనక బృందం నిలిచింది. మరోవైపు టీ20 సిరీస్‌ను 2-1తో గెలిచిన వన్డే సిరీస్‌లో మాత్రం రాణించలేకపోయింది. ఇరు జట్ల మధ్య కొలంబో వేదికగా ఆఖరి వన్డే జరుగనుంది.

చదవండి: USA Swimmer Anita Alvarez: నీటి అడుగున తేలియాడుతూ.. చావు అంచుల వరకు
Yashasvi Jaiswal On Jos Buttler: వరుస సెంచరీలు.. నా విజయ రహస్యం అదే! ఆయన వల్లే ఇదంతా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement