ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ టెస్టు క్రికెట్‌లో పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీలంకతో సిరీస్ ద్వారా అతడు రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
కాగా ప్రపంచకప్ టెస్టు చాంపియన్‌షిప్ 2023- 25 ఫైనల్ లక్ష్యంగా ముందుకు సాగుతోంది ఆసీస్. ఇందులో భాగంగా వచ్చే ఏడాది శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది.
ఈ టూర్ ద్వారా సిరీస్ ద్వారా మాక్సీని తిరిగి టెస్టుల్లో ఆడించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అందుకే టీ20 ఫార్మాట్ నుంచి అతడికి విశ్రాంతినిచ్చిన బోర్డు.. టెస్టులకు సన్నద్ధం కావాలని ఆదేశించిందని ఆస్ట్రేలియా మీడియా సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పేర్కొంది.
రెడ్‌బాల్ క్రికెట్‌లో తక్కువ మ్యాచ్‌లు మాత్రమే ఆడినా మాక్సీపై మేనేజ్‌మెంట్‌కు నమ్మకం ఉందని సన్నిహిత వర్గాలు తెలిపినట్లు వెల్లడించింది.
ఇక మాక్సీతో పాటు పీటర్ హ్యాండ్స్‌కోంబ్, జోష్ ఇంగ్లిస్ కూడా జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కాగా టీమిండియాతో సిరీస్‌లో భాగంగా 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు గ్లెన్ మాక్స్‌వెల్.
ఇప్పటి వరకు కేవలం ఏడు టెస్టులు ఆడిన ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. ఓ సెంచరీ సాయంతో 339 పరుగులు చేశాడు. అదే విధంగా ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. 2017లో చివరిసారిగా బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌లో ఆడిన మాక్సీ.. ఆ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమయ్యాడు.
ఈ క్రమంలో 2022లో శ్రీలంక టూర్‌కు ఎంపికైన మాక్సీ.. టెస్టు తుదిజట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో వార్విక్‌షైర్ తరఫున ఆడిన మాక్స్‌వెల్ 81 పరుగులతో రాణించాడు.
ఈ నేపథ్యంలో టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అతడిని ఆడించాలని బోర్డు భావించగా.. రోడ్డు ప్రమాదం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.
కాగా మాక్సీ టెస్టు కెరీర్ గొప్పగా లేకపోయినా.. శ్రీలంకలో స్పిన్నర్ల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆసీస్ బోర్డు అతడికి మరో అవకాశం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment