ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు పెద్ద మనుసు చాటుకుంది. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక ప్రజలకు సహాయం అందిస్తున్న యూనిసెఫ్‌కు(UNICEF) తమ వంతు విరాళాన్ని ప్రకటించింది. ఇటీవలే కంగారూలు.. లంకలో మూడు టీ20లతో పాటు వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడిన సంగతి తెలిసిందే. లంకలో నెలకొన్న పరిస్థితులను ఆసీస్ ఆటగాళ్లు దగ్గరుండి చూశారు.
ఎన్ని కష్టాలున్నా లంక, ఆసీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లను లంక ప్రేక్షకులు బాగా ఆదరించారు. లంక ప్రజల అభిమానం చూరగొన్న ఆసీస్ క్రికెటర్లు వారికి స్వయంగా కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే లంక పర్యటనలో భాగంగా వచ్చిన ప్రైజ్ మనీని యూనిసెఫ్ ద్వారా ఆస్ట్రేలియా క్రికెటర్లు లంక చిన్నారులకు అందించనుంది.
ఆస్ట్రేలియాలో యూనిసెఫ్ కు ఆ జట్టు టెస్టు సారథి ప్యాట్ కమిన్స్ బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నాడు. టెస్టులతో పాటు వన్డేలు, టీ20లలో భాగంగా ఆసీస్ ఆటగాళ్లకు వచ్చిన ప్రైజ్ మనీ (45వేల ఆస్ట్రేలియా డాలర్లు)ని లంకలో యూనిసెఫ్ కు అందించనున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వర్గాలు తెలిపాయి. నిత్యావసరాల ధరల పెరుగుదలతో ధరాభారం పెరిగి పెద్దలతో పాటు చిన్నారులు సైతం ఆకలితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలో వారి బాగోగులు చూసుకోవడానికి పనిచేస్తున్న యూనిసెఫ్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ ప్రైజ్ మనీని అందించనున్నారు.
ఇదే విషయమై కమిన్స్ మాట్లాడుతూ.. ‘శ్రీలంకలో ప్రజల బతుకులు ఎంత దుర్భరంగా ఉన్నాయనేది ప్రపంచం ముందు కనబడుతున్న సత్యం. మేము అక్కడ పర్యటించినప్పుడు వాళ్ల కష్టాలను స్వయంగా చూశాం. అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నాం. తద్వారా చిన్నారులకు, పేద ప్రజలకు సాయం చేయాలని ఆశించాం’ అని అన్నాడు.
కాగా కమిన్స్ ఇలా సాయం చేయడం తొలిసారి కాదు. గతేడాది కరోనా సందర్బంగా ఆక్సిజన్ సిలిండర్లు లేక భారత్ లో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ప్యాట్ కమిన్స్, క్రికెట్ ఆస్ట్రేలియా లు కలిసి 50వేల డాలర్ల ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఇక లంక పర్యటనలో ఆసీస్.. మూడు మ్యాచుల టీ20 సిరీస్ ను 2-1 తేడాతో గెలిచింది. కానీ వన్డే సిరీస్ ను మాత్రం కోల్పోయింది. ఇక టెస్టు సిరీస్ ను 1-1తో డ్రా చేసుకుంది.
చదవండి: రాస్ టేలర్ సంచలన ఆరోపణలు.. కివీస్‌కున్న ట్యాగ్‌లైన్ ఉత్తదేనా!
Rishabh Pant-Uravasi Rautela: బాలీవుడ్ హీరోయిన్‌కు పంత్ దిమ్మతిరిగే కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment