UNICEF Ambassador
-
'లంక దుస్థితికి చలించి'.. ఆసీస్ క్రికెటర్ల కీలక నిర్ణయం
ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు పెద్ద మనుసు చాటుకుంది. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంక ప్రజలకు సహాయం అందిస్తున్న యూనిసెఫ్‌కు(UNICEF) తమ వంతు విరాళాన్ని ప్రకటించింది. ఇటీవలే కంగారూలు.. లంకలో మూడు టీ20లతో పాటు వన్డే, టెస్టు సిరీస్‌లు ఆడిన సంగతి తెలిసిందే. లంకలో నెలకొన్న పరిస్థితులను ఆసీస్ ఆటగాళ్లు దగ్గరుండి చూశారు. ఎన్ని కష్టాలున్నా లంక, ఆసీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లను లంక ప్రేక్షకులు బాగా ఆదరించారు. లంక ప్రజల అభిమానం చూరగొన్న ఆసీస్ క్రికెటర్లు వారికి స్వయంగా కృతజ్ఞతలు కూడా చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే లంక పర్యటనలో భాగంగా వచ్చిన ప్రైజ్ మనీని యూనిసెఫ్ ద్వారా ఆస్ట్రేలియా క్రికెటర్లు లంక చిన్నారులకు అందించనుంది. ఆస్ట్రేలియాలో యూనిసెఫ్ కు ఆ జట్టు టెస్టు సారథి ప్యాట్ కమిన్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నాడు. టెస్టులతో పాటు వన్డేలు, టీ20లలో భాగంగా ఆసీస్ ఆటగాళ్లకు వచ్చిన ప్రైజ్ మనీ (45వేల ఆస్ట్రేలియా డాలర్లు)ని లంకలో యూనిసెఫ్ కు అందించనున్నట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వర్గాలు తెలిపాయి. నిత్యావసరాల ధరల పెరుగుదలతో ధరాభారం పెరిగి పెద్దలతో పాటు చిన్నారులు సైతం ఆకలితో అలమటిస్తున్నారు. ఈ క్రమంలో వారి బాగోగులు చూసుకోవడానికి పనిచేస్తున్న యూనిసెఫ్‌కు ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ ప్రైజ్ మనీని అందించనున్నారు. ఇదే విషయమై కమిన్స్ మాట్లాడుతూ.. ‘శ్రీలంకలో ప్రజల బతుకులు ఎంత దుర్భరంగా ఉన్నాయనేది ప్రపంచం ముందు కనబడుతున్న సత్యం. మేము అక్కడ పర్యటించినప్పుడు వాళ్ల కష్టాలను స్వయంగా చూశాం. అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నాం. తద్వారా చిన్నారులకు, పేద ప్రజలకు సాయం చేయాలని ఆశించాం’ అని అన్నాడు. కాగా కమిన్స్ ఇలా సాయం చేయడం తొలిసారి కాదు. గతేడాది కరోనా సందర్బంగా ఆక్సిజన్ సిలిండర్లు లేక భారత్ లో ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే ప్యాట్ కమిన్స్, క్రికెట్ ఆస్ట్రేలియా లు కలిసి 50వేల డాలర్ల ఆర్థిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఇక లంక పర్యటనలో ఆసీస్.. మూడు మ్యాచుల టీ20 సిరీస్ ను 2-1 తేడాతో గెలిచింది. కానీ వన్డే సిరీస్ ను మాత్రం కోల్పోయింది. ఇక టెస్టు సిరీస్ ను 1-1తో డ్రా చేసుకుంది. చదవండి: రాస్ టేలర్ సంచలన ఆరోపణలు.. కివీస్‌కున్న ట్యాగ్‌లైన్ ఉత్తదేనా! Rishabh Pant-Uravasi Rautela: బాలీవుడ్ హీరోయిన్‌కు పంత్ దిమ్మతిరిగే కౌంటర్ -
‘నిక్ విషయంలో నా అంచనా తప్పింది’
బాలీవుడ్ - హాలీవుడ్‌లలో ప్రస్తుతం మోస్ట్ రొమాంటిక్ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే అభిమానులు ఠక్కున చెప్పే పేరు ప్రియానిక్‌దే. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా- హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్‌లు గతేడాది డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. వీరిద్దరి వయస్సులో పదేళ్ల వ్యత్యాసం ఉండటం, శ్వేతజాతీయేతర వ్యక్తి నిక్‌ను పెళ్లాడటం నచ్చని హాలీవుడ్ పత్రికలు ఇప్పటికే వివాహ బంధాన్ని విమర్శిస్తూ కథనాలు ప్రచురించాయి. అంతేకాదు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారంటూ రూమర్లు కూడా ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వేదికపై తన భర్త నిక్ గురించి ప్రియాంక పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్‌లో జరిగిన 10వ అంతర్జాతీయ మహిళా వార్షికోత్సవ సదస్సులో యూనిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ హోదాలో ప్రియాంక హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, శరణార్థి క్యాంపుల్లో పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి గళం వినిపించారు. అనంతరం తన భర్త గురించి ప్రశ్నించగా.. ‘ పెళ్లికి రెండేళ్ల ముందు నుంచే నిక్ నాకు తెలుసు. కానీ తనను పెళ్లి చేసుకుంటానని మాత్రం ఎప్పుడూ ఊహించలేదు. నిక్ విషయంలో నా అంచనా తప్పింది. అయితే తనతో ప్రయాణం మొదలు పెట్టినపుడు తెలిసింది నేనెంత తప్పుగా ఆలోచించానో. అన్ని విషయాల్లో నాకు అండగా నిలిచే భర్త దొరికాడు. నేను తనని ఓల్డ్ మాన్ జోనస్ అని పిలుస్తా. ఎందుకంటే తను చాలా స్మార్ట్, నాకు ఎప్పుడు ఏం కావాలో చెప్పకుండానే అర్థం చేసుకుంటాడు. చిన్న పిల్లలా మారాం చేస్తూ ఏది కావాలన్నా, ఎక్కడున్నా తీసుకువచ్చి నా ముందు పెడతాడు అంటూ నిక్ జోనస్ వ్యక్తిత్వం గురించి చెబుతూ ప్రియాంక చిరునవ్వులు చిందించారు. -
హీరోయిన్‌పై విరుచుకుపడ్డ బీజేపీ నేత
లక్నో : రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ప్రియాంక చోప్రాను ఉద్దేశించి ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత వినయ్ కతియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియా కథనం ప్రకారం..‘రోహింగ్యాల నిజ స్వరూపం ప్రియాంక వంటి వాళ్లకు తెలియకపోవచ్చు. ఆమె అసలు వాళ్లను కలవడానికి వెళ్లాల్సింది కాదు. రోహింగ్యా ముస్లింలకు ఇక్కడ(భారత్‌లో) చోటు లేదు. అలాగే వాళ్లకు సానుకూలంగా మాట్లాడే వారికి కూడా ఇక్కడ స్థానం లేదు. రోహింగ్యాల పట్ల సానుభూతి చూపడానికి ఢాకా వెళ్లిన ప్రియాంక, ఆమె లాంటి మరెవరైనా ఈ దేశాన్ని(భారత్) విడిచి వెళ్లాల్సి ఉంటుందంటూ’ వినయ్ కతియార్ వ్యాఖ్యానించారు. యూనిసెఫ్ బాలల హక్కుల రాయబారిగా పనిచేస్తున్న ప్రియాంక.. బంగ్లాదేశ్‌లోని కుటుపలాంగ్‌తో పాటు కాక్స్ బజార్లో ఉన్న బలుఖలి శరాణార్ధుల శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులతో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. ‘ఒక చిన్నారి ఎక్కడ నుంచి వచ్చింది. ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చింది అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా ఫర్వాలేదు. కానీ భవిష్యత్తు పట్ల నమ్మకం లేని జీవితం మాత్రం ఏ చిన్నారికి ఉండవద్దు. ప్రపంచం వారి పట్ల శ్రద్ధ చూపాలి. దయచేసి చిన్నారులకు మీ మద్దతును అందివ్వండి’ అనే మెసేజ్ పెట్టారు. అయితే ప్రియాంక చేసిన పనిని కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుండగా.. ముస్లింలను పరామర్శించడమేమిటని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. -
ముస్లింలను పరామర్శిస్తావా...?
ముంబై : మంచి పని చేసినా దానికి మతం రంగు పులమడం నిజంగా విచారకరం. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు నటి ప్రియంక చోప్రా. ఈ బాలీవుడ్ హీరోయిన్ను యూనిసెఫ్ బంగ్లాదేశ్ పిల్లల హక్కుల ప్రచారకర్తగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రియాంక బంగ్లాదేశ్‌లోని కుటుపలాంగ్‌తో పాటు కాక్స్ బజార్లో ఉన్న బలుఖలి శరాణార్ధుల శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అయితే ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఓ వైపు ప్రియాంక పోస్టు చేసిన ఈ ఫోటోలకు దాదాపు 6 లక్షలకు పైగా లైక్స్ రాగా, మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం ఇది సెల్ఫీ స్టంట్లా, పబ్లిసిటీ స్టంట్లా ఉందంటూ విమర్శలు గుప్పించారు. కొందరైతే మరో అడుగు ముందుకేసి ముస్లిం పిల్లలకు సహయం చేయడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాక మన దేశంలో ఉన్న శరణార్ధులను ఎప్పుడైనా కలుసుకున్నారా?. కాశ్మీరీ పండిట్లు స్వయంగా మన దేశంలోనే శరాణార్ధులుగా బతుకుతున్నారు. వారిని ఎప్పుడైనా సందర్శించారా అంటూ ప్రశ్నల వర్షం కురింపించగా, మరికొందరు మాత్రం ప్రియాంక చేసిన పనిని మెచ్చుకున్నారు. యూనిసెఫ్ టీ షర్టుతో చిన్నారులను పలకరిస్తున్న ఫొటోను ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అంతేకాక ఈ ఫోటోలో ఒక చిన్నారి తాను ఆడుకునే బొమ్మ టీ కప్పును ప్రియాంకకు ఇవ్వగా, ప్రియాంక ఆ కప్పును తీసుకుని తాగుతున్నట్లు చేశారు. ఈ ఫోటోతో పాటు ప్రియాంక ‘ఒక చిన్నారి ఎక్కడ నుంచి వచ్చింది. ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చింది అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయిన ఫర్వాలేదు. కానీ భవిష్యత్తు పట్ల నమ్మకం లేని జీవితం మాత్రం ఏ చిన్నారికి వద్దు. ప్రపంచం వారి పట్ల శ్రద్ధ చూపాలి. మనం వారి పట్ల శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది. దయచేసి చిన్నారులకు మీ మద్దతును అందివ్వండి’ అనే మెసేజ్‌ను కూడా పోస్టు చేశారు. -
యూనిసెఫ్ ప్రచారకర్తగా సచిన్
-
యూనిసెఫ్ ప్రచారకర్తగా సచిన్
అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇటీవలే వీడ్కోలు తీసుకున్న సచిన్ టెండూల్కర్- యూనిసెఫ్ దక్షిణాసియా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. రెండేళ్ల పాటు అతడీ హోదాలో కొనసాగుతాడు. ఈ హోదాలో పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై అవగాహన పెంచే కార్యక్రమాల్లో సచిన్ పాల్గొననున్నాడు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో భారత్‌లో యూనిసెఫ్ ప్రతినిధి కరీన్ హల్షోఫ్ నుంచి సచిన్ నియామకపత్రం స్వీకరించాడు. యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు సచిన్ ఈ సందర్భంగా అన్నాడు.