వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023-25 సైకిల్‌లో ఆస్ట్రేలియా తమ ఆఖరి సిరీస్‌కు సిద్దమవుతోంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న ఆసీస్.. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తలపడేందుకు శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఇరు జట్ల మధ్య జనవరి 29 నుంచి ఈ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
ఈ క్రమంలో లంకతో సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ టూర్‌కు రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్(Pat cummins) దూరమయ్యాడు. అతడి భార్య రెండో బిడ్డకు జన్మనివ్వనుండడంతో ఈ సిరీస్ నుంచి కమ్మిన్స్ తప్పుకున్నాడు. అతడి స్దానంలో స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith ) ఎంపికయ్యాడు.
స్టార్క్‌కు నో రెస్ట్..
అదే విధంగా ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆడనున్నాడు. తొలుత అతడికి విశ్రాంతి ఇస్తారని వార్తలు వినిపించినప్పటికి, ఆసీస్ సెలక్టర్లు మాత్రం జట్టులో కొనసాగించారు. మరోవైపు స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ ప్రక్కటెముకుల గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.
భారత్‌తో జరిగిన సిరీస్‌లో గాయపడిన హాజిల్‌వుడ్.. ఇంకా కోలుకోవడానికి నెల రోజుల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అతడు తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో రానున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు వెల్లడించాయి. ఈ లంక సిరీస్‌కు ఎంపికైన జట్టులో మిచెల్ స్టార్క్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్ ఫ్రంట్‌లైన్ పేసర్లగా ఉన్నారు.
యువ సంచలనానికి పిలుపు..
ఆస్ట్రేలియా అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ కూపర్ కొన్నోలీకి తొలిసారి సెలక్టర్లు పిలుపునిచ్చారు. ఈ 16 మంది సభ్యుల జట్టులో కొన్నోలీకి చోటు దక్కింది. దేశీవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తుండడంతో అతడిని సెలక్టర్లు ఎంపిక చేశారు. కొన్నోలీ ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్‌స్కార్చర్స్ తరపున ఆడుతున్నాడు.
ఈ 21 ఏళ్ల కొన్నోలీకి బ్యాటింగ్‌తో అద్బుతమైన బౌలింగ్ సిల్క్స్ కూడా ఉన్నాయి. ఇక భారత్‌తో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్న స్పిన్నర్లు మాట్ కుహ్నెమాన్, టాడ్ మర్ఫీ తిరిగి జట్టులోకి వచ్చారు. అదేవిధంగా బీజీటీలో అదరగొట్టిన సామ్ కాన్‌స్టాస్, వెబ్‌స్టార్‌లను శ్రీలంక సిరీస్‌కు కూడా ఆసీస్ సెలక్టర్లు కొనసాగించారు.
ఆస్ట్రేలియా జట్టు: స్టీవ్ స్మిత్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, ట్రావిస్ హెడ్ (వైస్ కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, నాథన్ మెక్‌స్వీనీ, టాడ్ మర్ఫీ , మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్
చదవండి: 'రోహిత్ నిర్ణయం సరైనది కాదు.. ఇక టెస్టులకు విడ్కోలు పలికితే బెటర్'
Comments
Please login to add a commentAdd a comment