భారత్‌తో టెస్టు సిరీస్ అనంతరం ఆస్ట్రేలియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కంగారులు తలపడనున్నారు. అయితే ఈ పర్యటనకు ఆసీస్ రెగ్యూలర్ ప్యాట్ కమ్మిన్స్ దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ఈ సిరీస్ జనవరి 27 నుంచి ప్రారంభం కానుంది. సరిగ్గా ఇదే సమయంలో కమ్మిన్స్ భార్య బెకీ తమ రెండవ బిడ్డకు జన్మనిచ్చే అవకాశముంది. ఈ క్రమంలోనే కమ్మిన్స్ శ్రీలంకతో సిరీస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
తన కొడుకు అల్బీ పుట్టినప్పుడు పక్కనలేని కమ్మిన్స్.. ఈసారి రెండో బిడ్డ విషయంలో మాత్రం ఫ్యామిలీతోనే ఉండాలని భావిస్తున్నడంట. కమ్మిన్స్ ఇప్పటికే తన నిర్ణయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియాకు తెలియజేసినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
ఆసీస్ కెప్టెన్‌గా ట్రావిస్ హెడ్?
ఇక స్వదేశంలో భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో సత్తాచాటుతున్న ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్‌కు ప్రమోషన్ దక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీలంక టూర్‌కు ఒకవేళ కమ్మిన్స్ దూరమైతే, కెప్టెన్సీ బాధ్యతలు హెడ్‌కు అప్పగించాలని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వైస్ కెప్టెన్ స్మిత్ ఉన్నప్పటికి హెడ్ వైపే క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దలు మొగ్గు చూపుతున్నారంట. అయితే హెడ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా టెస్టుల్లో కెప్టెన్సీ చేయలేదు. కానీ వైట్ క్రికెట్‌లో మాత్రం సారథిగా హెడ్‌కు అనుభవం ఉంది.
బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్‌కు కెప్టెన్‌గా హెడ్ వహించాడు. కాగా బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో హెడ్ ఇప్పటికే రెండు సెంచరీలు సాధించాడు. పింక్‌బాల్ టెస్టులో ఆసీస్ ఘన విజయం సాధించడంలో హెడ్ కీలక పాత్ర పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment