శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా సూపర్ విక్టరీ సాధించింది. వర్షం హోరులో గ్లెన్ మ్యాక్స్‌వెల్ జోరు చూపించాడు. అతని మెరుపులకు తోడు జట్టు సమిష్టి ప్రదర్శన తోడవ్వండతో తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. కుషాల్ మెండిస్ 86 నాటౌట్, పాతుమ్ నిస్సాంక 56, గుణతిలక 55 రాణించారు. చివర్లో హసరంగా 19 బంతుల్లో 6 ఫోర్లతో 37 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
అయితే తొలి ఇన్నింగ్స్ అనంతరం ఆటకు 90 నిమిషాల పాటు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆసీస్ టార్గెట్‌ను 44 ఓవర్లలో 282 పరుగులుగా నిర్ణయించారు. డేవిడ్ వార్నర్ డకౌట్‌గా వెనుదిరిగినప్పటికి కెప్టెన్ ఆరోన్ ఫించ్ 44, స్టీవ్ స్మిత్ 53 జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత లబుషేన్ 24, మార్కస్ స్టోయినిస్ 44, అలెక్స్ క్యారీ 21 పరుగులు చేశారు. ఇక చివర్లో మ్యాక్స్‌వెల్ 51 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచి విధ్వంసం సృష్టించి జట్టును విజేతగా నిలిపాడు.
చదవండి: బెయిర్‌స్టో విధ్వంసకర శతకం.. కివీస్‌పై ఇంగ్లండ్ సంచలన విజయం
Comments
Please login to add a commentAdd a comment