డేవిడ్‌ వార్నర్‌ మంచి మనసు.. వీడియో వైరల్‌ | Australia Vs Sri Lanka Game, Cricket World Cup 2023: David Warner Helps Groundsmen With The Covers - Sakshi
Sakshi News home page

AUS vs SL: డేవిడ్‌ వార్నర్‌ మంచి మనసు.. వీడియో వైరల్‌

Published Mon, Oct 16 2023 7:22 PM | Last Updated on Mon, Oct 16 2023 7:50 PM

David Warner helps groundsmen with the covers - Sakshi

ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకతో ఆస్ట్రేలియా తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక ఇన్నింగ్స్‌ 32.1 ఓవర్ల వద్ద వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు. భారీ గాలులతో కూడిన వర్షం ఒక్కసారిగా రావడంతో ప్లేయర్స్‌ అందరూ డగౌట్‌ వైపు పరుగులు తీశారు.

కానీ డేవిడ్‌ వార్నర్‌ మాత్రం తన మంచిమనసును చాటుకున్నాడు. కవర్‌లను మైదానంలోకి తీసుకువచ్చేందుకు లక్నో గ్రౌండ్‌ స్టాప్‌కు వార్నర్‌ సహాయం చేశాడు. బౌండరీ లైన్‌ దగ్గర నుంచి పిచ్‌ వరకు గ్రౌండ్‌ స్టాప్‌తో పాటు వార్నర్‌ కవర్లను తీసుకువెళ్లాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది చూసిన అభిమానులు వార్నర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. ఆసీస్‌ బౌలర్ల ధాటికి 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో పాతుమ్ నిస్సాంక(61), కుశాల్‌ పెరీరా(78)  టాప్‌ స్కోరర్లగా నిలిచారు. ఆసీస్‌ బౌలర్లలో స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా 4 వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించగా.. ప్యాట్‌ కమ్మిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. 
చదవండి: WC IND Vs PAK: 'బాబర్‌ ఆజం చాలా పిరికివాడు.. ఫిప్టి కోసమే ఆడాడు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement