![Kuhnemanns four impact puts Australia on course for 2-0](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/srilankavsaustralia1.jpg.webp?itok=NW8BWiaD)
గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా విజయం దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. క్రీజులో కుశాల్ మెండిస్(48), నిషాన్ పెర్రిస్(0) ఉన్నారు. అయితే లంక జట్టు ప్రస్తుతం 54 పరుగుల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఆస్ట్రేలియా బౌలర్లలో కునేమన్ 4 వికెట్లు పడగొట్టగా.. నాథన్ లియోన్ మూడు, వెబ్‌స్టర్ ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు 330/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంబించిన ఆసీస్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 414 పరుగులకు ఆలౌటైంది. దీంతో కంగారులకు తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగుల ఆధిక్యం లభించింది.
స్మిత్, కేరీ సెంచరీల మోత..
కాగా మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ జట్టు 91 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ స్మిత్, కేరీ లంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ జంట ఆడుతూ పాడుతూ పరుగులు చేయడంతో ఆసీస్ భారీ స్కోరుకు బాటలు వేసుకుంది. ఈ క్రమంలో స్మిత్ 191 బంతుల్లో టెస్టుల్లో 36వ సెంచరీ నమోదు చేసుకోగా... కేరీ 118 బంతుల్లో టెస్టుల్లో తన రెండో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 239 పరుగులు జోడించారు.
ఇక శ్రీలంక బౌలర్లలో స్పిన్నర్ ప్రభాత్ జై సూర్య ఐదు వికెట్లతో సత్తాచాటగా.. పెర్రిస్ మూడు, మెండిస్ రెండు వికెట్లు సాధించారు. అదేవిధంగా శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్‌లో 257 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (139 బంతుల్లో 85 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) పోరాడాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, లయన్, కునేమన్ తలా 3 వికెట్లు పడగొట్టారు. ఇప్పటికే తొలి టెస్టులో గెలిచి సిరీస్‌లో 1–0తో ముందంజలో ఉన్న ఆస్ట్రేలియా.. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసే ఛాన్స్ ఉంది.
చదవండి: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే సరిపోదు.. టీమిండియాను ఓడించాలి: పాక్ ప్రధాని
Comments
Please login to add a commentAdd a comment