Virat Kohli Press Conference: Virat Kohli Comments on Mohammed Siraj Against SA 3rd Test - Sakshi
Sakshi News home page

Virat Kohli Press Conference: నేను ఫిట్‌గా ఉన్నా.. సిరాజ్‌ సిద్ధంగా లేడు: కోహ్లి

Published Mon, Jan 10 2022 3:33 PM | Last Updated on Mon, Jan 10 2022 6:38 PM

Ind Vs Sa 3rd Test: Virat Kohli Says Fit To Play Confirms Mohammed Siraj Not In Match - Sakshi

IND Vs SA 3rd Test: ఎట్టకేలకు టీమిండియా టెస్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మీడియా ముందుకు వచ్చాడు. దక్షిణాఫ్రికాతో నిర్ణయాత్మక మూడో టెస్టుకు ముందు నిర్వహించిన ప్రెస్‌ కాన్పరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తను ఫిట్‌గా ఉన్నాడని స్పష్టం చేశాడు. కేప్‌టౌన్‌ టెస్టుకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నాడు.

ఇక స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఇంకా పూర్తిగా కోలుకోలేదని కోహ్లి వెల్లడించాడు. ‘‘నేను పూర్తి ఫిట్‌నెస్ సాధించాను. సిరాజ్‌ మాత్రం మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధంగా లేడు. ఈరోజు జరిగే సమావేశంలో అతడి స్థానంలో ఎవరిని తీసుకోవాలో చర్చిస్తాం. నిజానికి సిరాజ్‌ స్థానాన్ని భర్తీ చేయడానికి మాకు చాలా ఆప్షన్స్‌ ఉన్నాయి. నిజంగా ఇది మాకు గర్వకారణం’’ అని కోహ్లి పేర్కొన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement