![ECB Clears That No Coronavirus For England Cricketers - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/9/England.gif.webp?itok=SDjxVHw4)
కేప్‌టౌన్ : దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టులో ఇద్దరు ఆటగాళ్లకు వైరస్ లక్షణాలు లేవని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) స్పష్టం చేసింది. బయో బబుల్‌లో ఉన్నప్పటికీ వీరితో పాటు బస చేసిన హోటల్ సిబ్బందికి కరోనా సోకినట్లు వార్తలొచ్చాయి. ఈ గందరగోళంలోనే మూడు వన్డేల సిరీస్ పూర్తిగా రద్దయింది. అయితే కరోనా అనుమానితుల్ని మిగతా ఆటగాళ్లకు దూరంగా ఐసోలేషన్‌లో ఉంచారు. ఈసీబీ వైద్యబృందం వారి నమూనాల్ని మరోసారి స్వతంత్ర వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షించింది. అయితే వైరస్ జాడ లేదని తెలియడంతో ఈసీబీ, దక్షిణాఫ్రికా క్రికెట్ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. ఇప్పుడు ఆ ఇద్దరు ఆటగాళ్లు ఐసోలేషన్ నుంచి విడుదలయ్యారు. జట్టుతో కలిసి గురువారం స్వదేశానికి పయనం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment