
లండన్ : కరోనా కారణంగా క్రికెట్ మిస్సవుతామనుకుంటున్న అభిమానులకు తీపివార్త. త్వరలోనే మైదానంలో క్రికెట్ సందడి మొదలు కానుంది. క్రికెట్ పునరుద్దరణ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చేస్తున్న ప్రయత్నాల్లో ముందడుగు పడింది. జులైలో ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సిరీస్‌లో జూన్‌లోనే జరగాల్సినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా కరోనా తర్వాత పరిస్థితులు చక్కబడటంతో క్రికెట్ పునరుద్దరణకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించింది. దీనిలో భాగంగా జీవ రక్షణ వాతావరణంలో పాకిస్తాన్, వెస్టిండీస్‌లతో జూలైలో సిరీస్‌లను నిర్వహిస్తామని ఈసీబీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లకు పాకిస్తాన్ ఇప్పటికే ఆమోదముద్ర వేయగా తాజాగా వెస్టిండీస్ సైతం అంగీకారం తెలిపింది. (రోహిత్ విజయ రహస్యమదే: లక్ష్మణ్)
ఇంగ్లండ్ పర్యటనకు సంబంధించిన వెస్టిండీస్ బోర్డు సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా అన్ని ప్రాంతాల నుంచి ఆటగాళ్లను, సిబ్బందిని రప్పించడం, వారికి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం, ప్రత్యేక/ప్రయివేట్ విమానాలను ఏర్పాటు చేయడం వంటి తదితర అంశాలపై సభ్యులు చర్చించారు. అనంతరం ఆటగాళ్లు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఈసీబీ అనేక చర్యలు చేపడుతుందనే విశ్వాసాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు వ్యక్తం చేసింది. ఇక వెస్టిండీస్‌తో మూడు టెస్టుల ముగిసిన వెంటనే పాకిస్తాన్‌తో ఇంగ్లండ్ మరో సిరీస్ ఆడనుంది. దీంతో క్రికెట్ పునరుద్దరణకు మార్గం సుగమమైందని, ఈ సిరీస్‌లు విజవంతంగా జరిగితే మరికొన్ని దేశాలు ఆడేందుకు ముందుకు వస్తాయని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (వాటే ప్లాన్ చైనా: భజ్జీ)
Comments
Please login to add a commentAdd a comment