
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ల మధ్య అక్టోబర్‌లో జరగాల్సిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ వాయిదా పడింది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మంగళవారం ప్రకటించింది. విండీస్ క్రికెట్‌తో చర్చించిన తర్వాతే తామీ నిర్ణయం తీసుకున్నట్లు సీఏ ప్రకటించింది. టి20 ప్రపంచ కప్ సన్నాహక సిరీస్‌గా సీఏ దీనిని ఏర్పాటు చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై అక్టోబర్ 4, 6, 9వ తేదీల్లో మూడు టి20 మ్యాచ్‌లు జరిగేలా షెడ్యూల్‌ను రూపొందించింది. అయితే కరోనా విజృంభణతో ఈ ఏడాది జరగాల్సిన టి20 ప్రపంచ కప్ వచ్చే ఏడాదికి వాయిదా పడటం... ఐపీఎల్ కూడా సరిగ్గా అదే సమయంలో జరుగనుండటంతో సిరీస్‌ను వాయిదా వేసినట్లు సమాచారం. సెప్టెంబర్‌లో పరిమిత ఓవర్ల క్రికెట్ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment