
మెల్‌బోర్న్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఆడుతున్న ఆటకు మిగతా ఆటలు వాయిదా పడుతున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ కూడా కోవిడ్ ఖాతాలోకి వెళ్లిపోయింది. మహమ్మారి ఉధృతి వల్లే ఇరు దేశాల బోర్డులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఆగస్టులో కంగారూ గడ్డపై ఆసీస్, జింబాబ్వేల మధ్య జరగాల్సిన మూడు వన్డేల సిరీస్ వాయిదా పడింది. ఈ నిర్ణయం నిరాశ కలిగిస్తున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పలేదని క్రికెట్ ఆస్ట్రేలియా ఇన్‌చార్జి సీఈఓ నిక్ హాక్లీ తెలిపారు. రీషెడ్యూల్‌పై ఇరు బోర్డులు సంప్రదింపులు చేశాక తదుపరి తేదీలను వెల్లడిస్తామని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment