
కేప్‌టౌన్ : దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ ఆడుతున్న భారత జట్టును నీటి కష్టాలు ఇబ్బందులు పెడుతున్నాయి. ప్రస్తుతం కేప్‌టౌన్‌లో అత్యంత దారుణ దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలో నీటికొరత తీవ్రంగా ఉంది. దీంతో భారత క్రికెటర్లు వినియోగించే నీటిపై అధికారులు ఆంక్షలు విధించారు. షవర్ కింద రెండు నిమిషాలు మాత్రమే స్నానం చేయాలని క్రికెటర్లకు అధికారులు స్పష్టం చేశారు. అలాగే టబ్ బాత్‌ను పూర్తిగా నిషేధించారు. ప్రస్తుతం కేప్‌టౌన్‌లో ఉష్ణోగత చాలా ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలనుంచి ఉపశమనం పొందేందుకు తాగే నీటిపైనా అధికారులు ఆంక్షాలు విధించారు. ‘తాగేందుకు కావలసిన స్థాయిలో నీరు ఇవ్వలేం.. కానీ ఎంత కావాలన్నా బీరు అందిస్తాం. ఒక వాటర్ బాటిల్ బదులు.. 10 బీర్లు ఇస్తామ’ని అధికారులు చెప్పడంతో.. షాక్ తినడం క్రికెటర్ల వంతైంది.
ఇదిలావుంటే.. పిచ్‌క్యూరింగ్, గ్రౌండ్ సిబ్బంది అవసరాల కోసం రోజుకు 87 లీటర్ల నీటిని మాత్రమే అధికారులు సరఫరా చేస్తున్నారు. పిచ్‌పై పచ్చికను కాపాడేందుకు కూడా ఈ నీరు సరిపోదని క్యూరేటర్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అవుట్ ఫీల్డ్ పూర్తిగా పొడిబారి పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉందని క్యూరేటర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment