కేప్‌టౌన్:మరికొద్ది రోజుల్లో దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే తొలి టెస్టు కోసం భారత జట్టు సిద్ధంగా ఉందని పేసర్ భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. ప్రస్తుతం సఫారీ గడ్డపై ఎదురయ్యే స్వింగ్, బౌన్సీ పిచ్‌లపై ఎంజాయ్ చేయడానికి తమ పేస్ విభాగం ఆసక్తిగా ఉందన్నాడు. కాకపోతే దక్షిణాఫ్రికాలో జరిగే మ్యచ్‌లకు ఏ పిచ్‌లు రెడీ చేశారో ముందే ఊహించడం చాలా కష్టమన్నాడు. ఒకసారి బౌన్స్ ఎక్కువగా అయితే, మరొకసారి స్వింగ్ విపరీతంగా అవుతుందన్నాడు. దీన్ని చిన్నసర్దుబాటుతో అధిగమిస్తామనే ధీమా వ్యక్తం చేశాడు భువీ.
'దక్షిణాఫ్రికా పర్యటన అనగానే అందరికీ గుర్తొచ్చేవి బౌన్సీ పిచ్‌లు. కానీ ఆట మొదలయ్యే వరకూ ఎలాంటి పిచ్ ఇచ్చారో మనం ఊహించలేం. ఒకవేళ బౌన్సీ పిచ్ ఇస్తే బ్యాట్స్‌మెన్‌కి కష్టాలు తప్పవు. బౌలర్లు మాత్రం చిన్న సర్దుబాటుతో తొలుత మెరుగ్గా బౌలింగ్ చేయవచ్చు. కాకపోతే కాకాబురా బంతితో 25-30 ఓవర్లు ముగిసే సరికే బౌన్స్ తగ్గుతుంది. అప్పుడు బౌలింగ్ చేయడం ఫాస్ట్ బౌలర్లకి ఓ సవాల్. సిరీస్‌లో అలాంటి పరిస్థితులు ఎదురైనా.. సమర్థంగా అధిగమించేందుకు తాము సిద్దంగా ఉన్నాం' అని భువనేశ్వర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment