ప్రాక్టీస్‌ మొదలుపెట్టేశారు..! | Team india in Cape Town begins preparations for the 1st Test | Sakshi
Sakshi News home page

ప్రాక్టీస్‌ మొదలుపెట్టేశారు..!

Published Sat, Dec 30 2017 6:22 PM | Last Updated on Sat, Dec 30 2017 6:26 PM

Team india in Cape Town begins preparations for the 1st Test - Sakshi

కేప్‌టౌన్‌: సుదీర్ఘ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికాకు చేరుకున్న టీమిండియా అప్పుడే ప్రాక్టీస్‌ ఆరంభించింది. టీమిండియా చీఫ్‌ కోచ్‌ రవిశాస్త్రి పర్యవేక్షణలో భారత క్రికెటర్లు ప్రాక్టీస్‌ చేశారు. ప్రధానంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి చాలాసేపు ప్రాక్టీస్‌ చేశాడు.  ఈ నెల 11న అనుష్క శర్మని వివాహం చేసుకున్న విరాట్ కోహ్లి..  శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. దాంతో ఆటపై ఏకాగ్రత సాధించేందుకు కోహ్లి ఎక్కువ సేపు ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు.

ప్రధానంగా కోహ్లితో పాటు పలువురు ప్రధాన ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. జనవరి 5వ తేదీ నుంచి దక్షిణాఫ్రికా-భారత్‌ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ ఆరంభం కానుంది. కేప్‌టౌన్‌లో జరిగే తొలి టెస్టుతో సిరీస్‌ ప్రారంభం కానుంది. మూడు టెస్టుల సిరీస్‌, ఆరు వన్డేల సిరీస్‌, మూడు టీ20ల సిరీస్‌లలో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లు బలంగా ఉండటంతో రసవత్తర పోరు ఖాయంగా కనబడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement