Ind Vs Sa Test Series 2021-22: దక్షిణాఫ్రికా గడ్డపై ఏడు పర్యటనల్లో ఒక్కసారి కూడా టెస్టు సిరీస్ గెలవలేకపోయిన భారత జట్టు ఈ సారి సిరీస్ విజయమే లక్ష్యంగా అక్కడ అడుగుపెట్టింది. సెంచూరియన్ విక్టరీతో దానికి బాటలు వేసుకున్నా... జొహన్నెస్‌బర్గ్‌లో ఆతిథ్య జట్టు పోరాటంతో లెక్క సమమైంది. ఇప్పుడు మరో అవకాశం మన ముంగిట నిలిచింది. గత మ్యాచ్‌లో ఓడినా ఇప్పటికీ ప్రత్యర్థితో పోలిస్తే టీమిండియా పటిష్టంగా కనిపిస్తోంది.
అయితే, సొంత మైదానంలో సిరీస్ చేజార్చుకోరాదనే పట్టుదల, గత మ్యాచ్ విజయం ఇచ్చిన స్ఫూర్తి సఫారీ టీమ్‌లో కూడా ఉత్సాహం పెంచాయి. న్యూలాండ్స్ మైదానంలో భారత్ గతంలో ఎన్నడూ గెలవకపోయినా...కొత్త చరిత్ర సృష్టించడం ఈ జట్టుకు కొత్త కాదు. ఇక
పిచ్, వాతావరణం
కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో దక్షిణాఫ్రికా- టీమిండియా మధ్య మూడో టెస్టు జరుగనుంది. ఒక టెస్టు మ్యాచ్‌కు సరిగ్గా సరిపోయే పిచ్ అని విశ్లేషకుల అంచనా. ఆరంభంలో పేసర్లు ప్రభావం చూపించడంతో పాటు బౌన్స్ కారణంగా బ్యాట్స్‌మెన్ కూడా బాగా పరుగులు సాధించే అవకాశం ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పొడిబారి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఖాయం. మంచి వాతావరణం, వర్షం సూచన లేదు.
టీమిండియా రికార్డు
న్యూలాండ్స్ మైదానంలో భారత్ 5 టెస్టులు ఆడింది. 3 మ్యాచ్‌లలో ఓడి 2 ‘డ్రా’గా ముగించింది.
భారత తుది జట్టు అంచనా: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్య రహానే, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్.
చదవండి: IPL 2022: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్!
🔊 🔊 🔛
— BCCI (@BCCI) January 10, 2022
Practice 🔛
𝐈𝐧 𝐭𝐡𝐞 𝐳𝐨𝐧𝐞 - 𝐂𝐚𝐩𝐭𝐚𝐢𝐧 𝐊𝐨𝐡𝐥𝐢.👌 👌#TeamIndia | #SAvIND | @imVkohli pic.twitter.com/ChFOPzTT6q
Comments
Please login to add a commentAdd a comment