కేప్‌టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య ప్రారంభమైన రెండో టెస్టు మొదటి రోజు వికెట్ల వర్షం కురిసింది. ఇరు జట్ల పేసర్ల చెలరేగడంతో ఏకంగా మొదటి రోజు 23 వికెట్లు నేలకూలాయి. మొదటి ఇన్నింగ్స్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా కేవలం 55 పరుగులకే కుప్పకూలగా.. అనంతరం టీమిండియా కూడా 153 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్లలో పేసర్ మహ్మద్ సిరాజ్ 6 వికెట్లతో విజృంభించాడు. సఫారీ బౌలర్లలో బర్గర్, రబాడ, ఎంగిడీ తలా మూడు వికెట్లు పడగొట్టారు.
ఇక కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న డీన్ ఎల్గర్.. ఈ టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ దారుణంగా విఫలమయ్యాడు. తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన ఎల్గర్ రెండో టెస్టులో మాత్రం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఇక తొలి రోజు ఆట అనంతరం స్టార్‌స్పోర్ట్స్‌తో మాట్లాడిన ఎల్గర్ కేప్‌టౌన్ పిచ్ పరిస్థితి గురించి వివరించాడు. సెషన్ కొనసాగుతన్నకొద్దీ వికెట్ పరిస్థితి మారిపోయిందని ఎల్గర్ చెప్పుకొచ్చాడు.
"సాధారణంగా న్యూలాండ్స్ పిచ్ కొంచెం స్లోగా ఉంటుంది. బ్యాటర్ కాస్త సమయం వెచ్చిస్తే క్రీజులో నిలదొక్కకోవచ్చు. అందుకే తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాను. కానీ ఈ మ్యాచ్‌లో సెషన్ కొనసాగుతున్న కొద్దీ బంతి గతిలో మార్పు కన్పించింది. అంతేకాకుండా బౌన్స్ కూడా చాలా ఎక్కవైంది. దీంతో బ్యాటర్లు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నాను.
అయితే పిచ్‌ను దగ్గరనుంచి చూస్తే బాగానే ఉన్నట్లు అన్పిస్తోంది. గతంలో ఎప్పుడూ ఈ వేదికలో ఇలా జరగలేదు. డొమాస్టిక్ క్రికెట్‌లో కూడా ఇప్పటివరకు ఇంత చెత్త గణాంకాలు నమోదు కాలేదు. ఇటువంటి పిచ్‌ను ఇప్పటివరకు నా కెరీర్‌లో చూడలేదు" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్గర్ పేర్కొన్నాడు. కాగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది.
చదవండి: Ind Vs SA: రెండో టెస్టులో విజయం భారత్‌దే.. ఎందుకంటే?: టీమిండియా దిగ్గజం
Comments
Please login to add a commentAdd a comment