బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా కల్లిస్‌ | South Africa Appoints Jacques Kallis As Batting Consultant | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా కల్లిస్‌

Published Wed, Dec 18 2019 3:47 PM | Last Updated on Wed, Dec 18 2019 3:48 PM

South Africa Appoints Jacques Kallis As Batting Consultant - Sakshi

కేప్‌టౌన్‌: సంధి దశను ఎదుర్కొంటున్న దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు దిద్దుబాటు చర్యలను వేగవంతం చేసింది. ఇటీవల ప్రధాన కోచ్‌గా మార్క్‌ బౌచర్‌ను నియమించిన దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు.. తాజాగా బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా మరో దిగ్గజ ఆటగాడు జాక్వస్‌ కల్లిస్‌ను ఎంపిక చేసింది. సమ్మర్‌లో సద్వేశంలో జరుగనున్న మొత్తం మ్యాచ్‌లకు కల్లిస్‌ను బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈరోజే బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌ బాధ్యతలను కల్లిస్‌ స్వీకరించనున్నాడు. ఈ విషయాన్ని తమ అధికారిక ట్వీటర్‌ అకౌంట్‌లో దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు స్పష్టం చేసింది.

519 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన కల్లిస్‌ దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించాడు. ఆల్‌ రౌండర్‌గా సఫారీలకు వెన్నుముకగా నిలిచాడు. 166టెస్టులు, 328 వన్డేలు, 25  అంతర్జాతీయ టీ20లు ఆడిన అనుభవం కల్లిస్‌ది. దక్షిణాఫ్రికా తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 25, 534 పరుగులు సాధించిన కల్లిస్‌.. 577 వికెట్లు తీశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement