సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. టీమిండియాను భయపెడుతున్న రికార్డులు! | India's Test Record At Newlands In Cape Town | Sakshi
Sakshi News home page

IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. టీమిండియాను భయపెడుతున్న రికార్డులు! ఒక్కసారి కూడా

Published Mon, Jan 1 2024 10:50 AM | Last Updated on Mon, Jan 1 2024 1:23 PM

Indias Test Record At Newlands In Cape Town - Sakshi

కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కాపాడుకోవాలని భారత జట్టు భావిస్తోంది. ఈ మ్యాచ్‌ కోసం రోహిత్‌ సేన నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కేప్‌టౌన్‌లోని రికార్డులు భారత జట్టును భయపెడుతున్నాయి. కేప్‌టౌన్‌లోని న్యూల్యాండ్స్‌ క్రికెట్‌ స్టేడియంలో టీమిండియా టెస్టు రికార్డు మరి దారుణంగా ఉంది.

న్యూలాండ్స్‌లో భారత్‌ రికార్డులు ఇవే..
►ఇప్పటివరకు కేప్‌టౌన్‌లో ఆరు టెస్టు మ్యాచ్‌లు ఆడిన భారత్‌.. ఒక్క మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించలేదు. 4 మ్యాచ్‌లలో భారత్‌ ఓటమి పాలవ్వగా.. రెండు సార్లు డ్రా ముగిచింది. ఈ వేదికలో 1993లో భారత్‌ తొలి టెస్టు మ్యాచ్‌ ఆడింది.

►ఈ స్టేడియంలో టీమిండియా అత్యధిక  అత్యధిక స్కోర్‌ 414 పరుగులగా ఉంది. 2007లో ప్రోటీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 131.1 ఓవర్లలో 414 పరుగులకు ఆలౌటైంది.

►ఈ వేదికలో భారత జట్టు అత్యల్ప స్కోర్‌ 135గా ఉంది. 2018లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 42.4 ఓవర్లలో 135 పరుగులకు టీమిండియా ఆలౌటైంది.

►న్యూలాండ్స్‌ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు భారత క్రికెట్‌ దిగ్గజం  సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉంది.  ఈ వేదికలో నాలుగు టెస్టులు ఆడిన సచిన్‌ 489 పరుగులు సాధించాడు.

►అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా మాజీ పేసర్‌ జవగల్‌ శ్రీనాథ్‌ ఉన్నాడు. రెండు టెస్టులు ఆడిన శ్రీనాథ్‌ 12 వికెట్లు పడగొట్టాడు.

►అత్యధిక సిక్స్‌లు కొట్టిన రికార్డు టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌(4) పేరిట ఉంది.
చదవండి: 2024 ఏడాదిలో టీమిండియా షెడ్యూల్‌ ఇదే.. ఈ సారైనా కల నెరవేరేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement