పోర్ట్ ఎలిజబెత్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో 3 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైనప్పటకి ఆఫ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన అద్బుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి బంతితో మాయ చేశాడు. 125 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో ప్రోటీస్ బ్యాటర్లను చక్రవర్తి ముప్పుతిప్పలు పెట్టాడు. మార్‌క్రమ్, క్లాసెన్, హెండ్రిక్స్, మిల్లర్, జాన్సెన్ వంటి కీలక వికెట్లు పడొట్టి ఆతిథ్య జట్టును ఓటమి కోరల్లో చిక్కుకునేలా చేశాడు.
కానీ ప్రోటీస్ బ్యాటర్ స్టబ్స్ అద్బుత పోరాటంతో తన జట్టును ఓటమి నుంచి తప్పించాడు. ఈ మ్యచ్‌లో వరుణ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఓ అరుదైన ఈ తమిళనాడు స్పిన్నర్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
తొలి భారత బౌలర్‌గా..
👉అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా తరపున ఐదు వికెట్ల హాల్ సాధించిన అతి పెద్ద వయుష్కుడిగా వరుణ్ రికార్డులకెక్కాడు. చక్రవర్తి 33 సంవత్సరాల 73 రోజుల వయస్సులో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్(32 సంవత్సరాల, 215 రోజులు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో భువీ ఆల్‌టైమ్ రికార్డును వరుణ్ బ్రేక్ చేశాడు.
👉అదేవిధంగా ఓ టీ20 మ్యాచ్‌లో 5 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో భారత స్పిన్నర్‌గా చక్రవర్తి నిలిచాడు. ఈ జాబితాలో స్టార్ స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు.
👉ఓవరాల్‌గా టీ20ల్లో 5 వికెట్ల ఘనత సాధించిన ఐదో భారత బౌలర్‌గా వరుణ్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో యజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్ (రెండుసార్లు), భువనేశ్వర్ కుమార్ (రెండుసార్లు) ఉన్నారు.
చదవండి: చాలా గర్వంగా ఉంది.. ఈ రోజు కోసమే అతడు ఎంతో కష్టపడ్డాడు: సూర్య
— viratgoback (@viratgoback) November 10, 2024
Comments
Please login to add a commentAdd a comment