
కేప్‌టౌన్: భారత్‌తో న్యూలాండ్స్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోగా ఆతిథ్య జట్టులో స్వల్ప మార్పులు జరిగాయి. గాయంతో దూరమైన సఫారీ కీపర్ డికాక్ స్థానంలో హెన్రీచ్ క్లాసెన్, బౌలర్ మోర్కెల్ స్థానంలో లుంగి ఎంగిడిలను తీసుకున్నారు. ఈ ఇద్దరు ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేస్తున్నారు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి మంచి ఊపు మీదున్న కోహ్లి సేన మరో విజయం సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాలని ఉవ్విల్లూరుతోంది. ఇక ఆతిథ్య జట్టుకు గాయాల బెడద వెంటాడుతుండగా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌పై అవకాశాలు వదులుకోవద్దని సఫారీ జట్టు భావిస్తోంది.
జట్లు
భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రోహిత్, రహానే, జాదవ్, ధోనీ, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా.
దక్షిణాఫ్రికా: మార్క్‌రమ్ (కెప్టెన్), ఆమ్లా, డుమిని, మిల్లర్, జొండొ, హెన్రీచ్ క్లాసెన్, మోరిస్, రబడ, తాహీర్, ఆండీల్ పెహ్లుక్వాయో, లుంగి ఎంగిడి
Comments
Please login to add a commentAdd a comment