
మండేలా అంత్యక్రియలకు 450 మంది!
కేప్ టౌన్: జాతివివక్ష వ్యతిరేకోద్యమ నాయకుడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా అంత్యక్రియలకు సుమారు 450 మంది అతిథులు హాజరవుతారని ప్రభుత్వం ప్రకటించింది. మండేలా కుటుంబ సభ్యులతో సహా అతిథులను అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి అనుమతిస్తామని తెలిపింది.
సాధారణ ప్రజలను అంత్యక్రియలు జరిగే ప్రదేశానికి అనుమతించబోమని వెల్లడించింది. నెల్సన్ మండేలా అంత్యక్రియలను దక్షిణాఫ్రికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మండేలా అంత్యక్రియలు ఆయన తెగ హోసాకు చెందిన శ్మశానంలో జరుగుతాయి.