
కేప్‌టౌన్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అయి మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. దీంతో భారత్ పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్ వేసిన రబడా బౌలింగ్‌లో 6 బంతులు ఎదుర్కొన్న రోహిత్ చివరి బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. గత రెండు వన్డేల్లో తీవ్రంగా నిరాశపర్చిన రోహిత్ ఈ మ్యాచ్‌లోనైనా చేలరేగుతాడని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. అనంతరం క్రీజులోకి కోహ్లి వచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment